మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. అలాంటి హిట్ సినిమాలు ముగ్గురు మొనగాళ్లు మూవీ చాలా హిట్ అయింది. చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ముగ్గురు మొనగాళ్లు చిత్రానికి మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా చేశారు. అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి ముందు మెగాస్టార్ ఘరానా మొగుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ మూవీకి రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా అలరించింది.
ALSO READ:RRR టీమ్ ఆస్కార్ ప్రయాణ ఖర్చులను భరించింది అతడేనా..?
Advertisement
ఇందులో చిరు మూడు పాత్రల్లో చేసి అందరినీ ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ఇందులో ఒకటి పోలీసు పాత్ర మరొకటి దత్తాత్రేయ పాత్ర మూడవది పృథ్వి పాత్ర ఈ మూడు పాత్రలో చిరు చాలా డిఫరెంట్ గా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు మూడు పాత్రలకు మూడు రకాలుగా గొంతులు మార్చి డబ్బింగ్ చెప్పడం కూడా ఈ సినిమాలో మరో హైలెట్ అని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ముగ్గురిని చూపించాలి కాబట్టి రెండు పాత్రల కోసం డూపుల అవసరం ఏర్పడింది.
Advertisement
ALSO READ:రాత్రిపూట మీరు చపాతీలు తింటున్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!
చిరంజీవికి డూప్ గా ఆయన వద్ద పిఏగా పనిచేస్తున్న సుబ్బారావు మరియు ప్రసాద్ రావు నటించారు. వారిద్దరి ఎత్తు బరువు చిరంజీవికి సరిపోవడంతో వాళ్లని సినిమా కోసం డూపులుగా తీసుకున్నారు. ఈ చిత్రానికి కాకుండా మెగాస్టార్ గా డూపులుగా వీరిద్దరు మరికొన్ని చిత్రాల్లో నటించారు. ఇక ఈ ముగ్గురు మొనగాళ్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రాఘవేంద్రరావు డైరెక్షన్లో మెగాస్టార్ టాలెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
ALSO READ:Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని