సీఎం కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దాంతో శోభ వెంట కేసీఆర్ తో పాటూ ఆయన కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ సీఎం కేసీఆర్ సైతం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఏఐజీ చైర్మెన్ ఆధ్వర్యంలో వైద్యులు కేసీఆర్ కు అన్ని రకాల వైద్యపరీక్షలను నిర్వహించారు. అంతే కాకుండా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై ఓ ప్రకటన సైతం విడుదల చేశారు. సీఎం కేసీఆర్ కడుపునొప్పితో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.
Advertisement
పొత్తికడుపులో నొప్పిరావడంతో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఏఐజీ చైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆయనకు వైద్య పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు. ఎండో స్కోపీ మరియు సిటీ స్కాన్ పరీక్షలు చేశామని తెలిపారు. కాగా ఆ పరీక్షల్లో కేసీఆర్ పొత్తికడుపులో అల్సర్ ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
Advertisement
అంతే కాకుండా మిగతా వైద్య పరీక్షల్లో అన్నీ నార్మల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. దాంతో గతంలో కంటే బిజీగా ఉంటున్నారు. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. అంతే కాకుండా బీజేపీని ఢీ కొట్టేందుకు దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారిని కలుపుకుని ముందుకు వెళుతున్నారు.
ALSO READ : ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?