గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవిత్ర లోకేష్, నరేష్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు కేవలం సోషల్ మీడియాకే పరిమితమైన వీరి వ్యవహారం ప్రస్తుతం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా చేరుకుంది. ఎక్కడా చూసిన వీరి రచ్చే కొనసాగుతోంది. అయితే తాజాగా నరేష్, పవిత్ర లోకేష్ మూడుముళ్ల బంధంతో ఒక్కటైనట్లుగా తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూ ఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట, పెళ్లితో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు.
READ ALSO : Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!
Advertisement
అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి మ్యారేజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. సాంప్రదాయబద్ధంగా మూడు ముళ్ళు, ఏడు అడుగులు వేసింది ఈ జంట. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త ప్రారంభం అని, అందరి ఆశీస్సులు కావాలంటూ తమ రిలేషన్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తమ బంధాన్ని రివిల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు కూడా.
Advertisement
READ ALSO : NOKIA : లోగో మార్చిన నోకియా… ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం
నరేష్ చాలా కాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్ధలు కారణంగా పవిత్ర సైతం తన భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళు సినిమాల్లో కలిసి నటించిన, వీరిరువురు, కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు నరేష్, పవిత్ర లోకేష్.ఈ మేరకు నరేష్ ట్వీట్ చేసి వీడియో రిలీజ్ చేశాడు. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు అంటూ ట్వీట్ చేశారు నరేష్.
READ ALSO : ఈ 3 లక్షణాలు మీలో ఉన్నాయా… అయితే గుండెపోటు వచ్చే ప్రమాదం పక్కా!