భారతదేశంలో హిందూ సంస్కృతి సంప్రదాయం ప్రకారం.. రకరకాల ఆచాలుంటాయి. ఇప్పటికీ దాదాపు ఈ సంప్రదాయాల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ ప్రజలందరూ వాటిని పాటిస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయాల్లో ఒడి బియ్య ఒకటి. సాధారణంగా పెళ్లి జరిగిన తరువాత పుట్టింటి వారు తమ కూతుర్లకు అప్పుడప్పుడు ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. ప్రతీ ఏడాది కూతురిని ఇంటికి పిలిచి తల్లిదండ్రులు తమ స్థోమతకి తగ్గట్టు కొత్త బట్టలు తెచ్చి ఒడిబియ్యం పోస్తుంటారు. ఇలా ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఒడిబియ్యం పెట్టడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : ఈ 15 మంది టాలీవుడ్ దర్శకులు.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసే వారో తెలుసా ?
Advertisement
ఒడి బియ్యం గురించి పండితులు ఏమంటున్నారంటే.. సాధారణంగా మనిషి శరీరంలో నాడులు కలిసే ప్రతీ చోట ఒక చక్రం ఉంటుంది. ఇలా మానవ శరీరంలో ఏడు చక్రాలుంటాయి. ఈ ఏడు చక్రాల్లో గౌరీదేవి 7 రూపాల్లో నిక్షిప్తమై ఉంటుంది. అందులో ఒకటి మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపుర చక్రంలోని మధ్యభాగంలో ఒడ్డియాన పీఠం ఉంటుంది. ఈ ఒడ్డియాన పీఠంలో ఉండే శక్తిని మహాలక్ష్మీగా భావిస్తారు. పెళ్లి జరిగిన తరువాత ఆడపిల్లలకు ఒడిబియ్యం సమర్పించడం అంటే.. ఒడ్డి యాన పీఠంలో ఉన్న మహాలక్ష్మీ అనే శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.
Advertisement
Also Read : రుద్రాక్ష మాలను ధరిస్తున్నారా…? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.
ఆడపిల్లలను తల్లిదండ్రులు ఇంటి ఆ ఇంటికి మహాలక్ష్మీగా భావించి వివాహం తరువాత ఒడిబియ్యం పోస్తుంటారు. ఆ సమయంలో కూతురిని మహాలక్ష్మీగా భావించి ఆమె పక్కన ఉన్న భర్తని మహావిష్ణువుగా భావిస్తారు.తల్లి ఒడి అంటే.. ఓ రక్షణ నిలయం. అంటే మహాలక్ష్మీగా భావించే ఆడపిల్లలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులకు రక్షణగా నిలుస్తారు. తల్లిదండ్రులు తమ బిడ్డకు ఒడిబియ్యం పోసే సమయంలో బియ్యం మాత్రమే కాకుండా.. అష్ట ఐశ్వర్యాలను కూడా పోస్తారు. అంటే తమ బిడ్డ జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. ఆ సంతోషంతో కూతురు తన పుట్టిల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని తన ఒడిబియ్యంలో నుంచి ఐదు పిడికిల్ల బియ్యం తన పుట్టింటికి ఇచ్చి పుట్టినింటి మహాద్వారానికి పసుపు, కుంకుమ పెట్టి అత్తింటికి వెళ్తుంది.