టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు, వ్యాపారవేత్తలుగా ఎదిగారు.
Advertisement
అయితే నందమూరి కుటుంబంలో చాలా చీకటి కోణాలు ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న చీకటి వాస్తవాలలో త్రివిక్రమ రావు ఒక ఉదాహరణ. అన్నా తమ్ముల అనుబంధం అనే సినిమా తీసేంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్టీఆర్, త్రివిక్రమ రావు ఎందుకు విడిపోయారు అన్న విషయమే చాలామందికి తెలియదు.
READ ALSO : విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన ఉమేష్ యాదవ్
Advertisement
తెర వెనక అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరు చెప్పరు కూడా. త్రివిక్రమ రావు తన కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేసే సమయంలో కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదు అని కొంతమంది అంటూ ఉంటారు. ఇక త్రివిక్రమ రావు కొడుకు చక్రవర్తి ఉన్నపలంగా ఇండస్ట్రీని వదిలి ఎందుకు వెళ్లారో కూడా చాలామందికి తెలియదు. ఈ విషయం కూడా ఎప్పుడు నందమూరి కుటుంబం మాట్లాడలేదు. హీరో నవీన్ వడ్డే వ్యవహారం కూడా ఇంచుమించు ఇలాంటిదే.
READ ALSO : ఉప్పెన సినిమా కథను.. వినకుండానే రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?
నందమూరి కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించిన పాపానికి అతడికి భవిష్యత్తు లేకుండా చేశారు అని చాలామంది అంటుంటారు. అందులో నిజం ఎంత ఉన్నా కూడా నవీన్ వడ్డే మాత్రం దాదాపు కెరియర్ ను పోగొట్టుకున్నాడు. నందమూరి కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్లు జరగడం ఇష్టం ఉండదు అని ఈ సంఘటన కూడా రుజువు చేస్తుంది. తారకరత్న విషయంలో కూడా ప్రేమ పెళ్లి కారణంగానే గొడవలు అయ్యాయని విషయం మన అందరికీ తెలిసిందే.
READ ALSO : Samantha: సమంత చేతులకు గాయాలు.. రక్తంతో షాకింగ్ పోస్ట్