భారత మహిళల క్రికెట్ జట్టులో సభ్యురాలిగా, కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందిస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్. అయితే ప్లేయర్ గా ప్రస్తుతం ఆమె అంతగా ఫామ్ లో లేదు. భారీ స్కోర్ కూడా చేయడం లేదు. కానీ కెప్టెన్ ముందుండి జట్టును నడిపిస్తోంది. వ్యక్తిగతంగా ఫెయిల్ అయినప్పటికీ కెప్టెన్సీ పరంగా అద్భుతమైన విజయాలను సాధిస్తుంది.
Advertisement
తాజాగా సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో కూడా టీమిండియాను సెమీఫైనల్ వరకు తీసుకెళ్లింది. ఫిబ్రవరి 23న జరిగే తొలి సెమీఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. ఈ మ్యాచ్ తో హర్మన్ ప్రీత్ కౌర్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకోనుంది. ముఖ్యంగా 150 టీ-20 మ్యాచ్ లు ఆడి తొలి ఉమెన్ క్రికెటర్ గా హర్మన్ రికార్డు సృష్టించనుంది. సెమీస్ మ్యాచ్ పురస్కరించుకొని దిగ్గజ క్రికెటర్.. డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక అదే సమయంలో హర్మన్ ప్రీత్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. “ గూగుల్ కి వెళ్లి ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ ఎవరు అని సెర్చ్ చేస్తే హర్మన్ ప్రీత్ కౌర్ పేరు మాత్రం అస్సలు కనిపించడం లేదు.
Advertisement
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక ఈ సమస్యను మనమే సృష్టిస్తే.. దానిని పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. మహిళల క్రికెట్ కోసం అది చేద్దాం. #IndianCricketTeamCaptainHarmanpreethkauron #Twitter #Quora #Linkedln #Reddit వంటి పదాలను అన్నింటిలో మనం షేర్ చేసి చక్కదిద్దుకుందాం” అని ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్. ప్రస్తుతం యువరాజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాల తెగ వైరల్ అవుతోంది. మహిళా క్రికెట్ ని హర్మన్ ప్రీత్ కౌర్ సరికొత్త దిశలో తీసుకెళ్తుంది. ‘ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుదాం’ అంటూ పలువురు క్రికెటర్లు, అభిమానులు యూవీకి మద్దతు పలుకుతున్నారు. మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా యువరాజ్ ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ.. సేమ్ వీడియోని షేర్ చేశాడు. మహిళల టీ-20 ప్రపంచ కప్ లో 4 మ్యాచ్ లు ఆడిన హర్మన్ కేవలం 66 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్ సగటు 20 కంటే తక్కువ స్ట్రైక్ రేట్ 85 కన్నా తక్కువ. రాబోయే మ్యాచ్ లో ఆమె ఫామ్ లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read : ఈ స్టార్ క్రికెటర్ల కంటే కూడా వాళ్ల భార్యలు వయసులో పెద్ద.. లిస్ట్ లో 5 గురు..!