శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటుంటారు. అంతటి మహా శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన శివలింగానికి పూజలు చేస్తాం. మరి శివలింగానికే ఎందుకు పూజలు చేస్తాం.. దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శివలింగం అంటే అర్థం:
హిందువులు శివలింగాన్ని దైవంగా కొలుస్తారు. సంస్కృతిలో శివ అంటే శుభమని, లింగం అంటే గుర్తింపు లేదా సాంకేతం అని అర్థం. అంటే శివలింగం అనేది శివుడు యొక్క గుర్తింపును సూచిస్తుంది. లేదా సర్వప్రదమైన దైవాన్ని తెలుపుతుంది.
కథ :
ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18న జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున అర్ధరాత్రి లింగోద్భావ కాలపూజ మహా దేవుడిని కొలిచేందుకు అనుకూలమైన సమయం. త్రిమూర్తులతో ఇద్దరైనా బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి.. అది యుద్ధానికి దారితీస్తుంది. దీంతో ప్రపంచం అల్లా కల్లోలం అయింది. ఇక వీరి యుద్ధాన్ని ఆపేందుకు మహాశివుడు రంగంలోకి దిగాడు. ఆ పరమశివుడు అధ్యంతాలు తెలియని మహా అగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి.
Advertisement
Advertisement
అందుకే దీనిని లింగోద్భావ కాలమని అంటారు. అయితే లింగం యొక్క మొదలును కనుక్కోవడానికి విష్ణు వరాహ రూపంలో ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లారు. శివుడి వాస్తవ గమ్యాన్ని చేరుకోలేక తిరిగివచ్చి పరమేశ్వరున్ని శరణు వేడారు. దాంతో ఆయన వాస్తవరూపంతో దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. అయితే మొదటిసారిగా శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భావ కాలానికి అంత విశిష్టత ఉంది. ఈ టైంలో మహాదేవున్ని ఆరాధిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
also read: