Home » మ‌నం అభిమానించే హీరోల ఒరిజిన‌ల్ పేర్లు ఎంత మందికి తెలుసు.?

మ‌నం అభిమానించే హీరోల ఒరిజిన‌ల్ పేర్లు ఎంత మందికి తెలుసు.?

by Bunty
Ad

మ‌నం అభిమానించే హీరోల గురించి మీకు తెలుసా.. వారు సినిమాల్లో ఒక పేరు నిజజీవితంలో మ‌రొక పేరు ఉంటుంటుంది. చాలా వ‌ర‌కు హీరోలు ఒరిజిన‌ల్ గా ఒక‌టి, సినిమాల్లో మ‌రొక‌టి ఉంటుంటాయి. ముఖ్యంగా రెబ‌ల్ స్టార్, పానిండియా హీరో ప్ర‌భాస్ క్రేజీ మ‌నంద‌రికీ తెలిసిందే. కానీ ఆయ‌న పూర్తి పేరు తెలియ‌ని వారు మాత్రం చాలా మందినే ఉన్నారు. అదేవిధంగా నానీ ఆయ‌న అంద‌రికీ బాగా తెలుసు. కానీ ఆయ‌న అస‌లు పేరు మాత్రం చాలా మందికి తెలియ‌దు. మ‌న హీరోల స్క్రీన్ పేర్లు ఒరిజిన‌ల్ పేర్లు ఏమిటో ఒకసారి లుక్కేద్దాం..!

 

Advertisement

మెగాస్టార్ చిరంజీవి అస‌లు పేరు కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్, సూప‌ర్ స్టార్ కృష్ణ అస‌లు పేరు ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ‌, స్క్రీన్ నేమ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అస‌లు పేరు కొణిదెల క‌ల్యాణ్ బాబు, నాచుర‌ల్ స్టార్‌ నాని అస‌లు పేరు ఘంటా న‌వీన్ బాబు, స్క్రీన్ నేమ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అస‌లు పేరు ఉప్ప‌ల‌పాటి వెంక‌ట‌స‌త్య‌నారాయ‌ణ ప్ర‌భాస్ రాజు, రజినీకాంత్ అస‌లు పేరు శివాజీ రావు గైక్వాడ్‌, యాక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు అస‌లు పేరు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడుగా ఉంది.

Advertisement

 

ఇక త‌మిళ హీరో స్క్రీన్ నేమ్ క‌మ‌ల్ హాస‌న్ అయితే అస‌లు పేరు పార్థ‌సార‌థి శ్రీ‌నివాస‌న్‌, ర‌వితేజ అస‌లు పేరు భూప‌తిరాజు ర‌విశంక‌ర్ రాజు, జ‌గ‌ప‌తిబాబు అస‌లు పేరు వీర‌మాచినేని జ‌గ‌ప‌తిరావు, ముమ్మ‌ట్టి అస‌లు పేరు మ‌హ్మ‌ద్ కుట్టి ప‌ని ప‌రంబాల్ ఇస్మాయిల్, ఆర్య అస‌లు పేరు జంషెడ్ కేతిరాక‌త్‌, ధ‌నూష్ అస‌లు పేరు వెంక‌టేష్ ప్ర‌భు, స‌త్య‌రాజ్ అస‌లు పేరు రంగ‌రాజ్‌, సూర్య అస‌లు పేరు శ‌ర‌వ‌ణ‌న్ శివ‌కుమార్‌, విక్ర‌మ్ అస‌లు పేరు కెన‌డీ జాన్ విక్ట‌ర్‌, జీవా అస‌లు పేరు అమ‌ర్, య‌శ్ అస‌లు పేరు న‌వీన్ కుమార్ గౌడ‌, స్క్రీన్ నేమ్ విజ‌య్ అస‌లు పేరు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌కాంత్ ఇలా సినిమా హీరోల పేర్లు ఒక విధంగా.. నిజ‌జీవితంలో మ‌రొక విధంగా ఉన్నాయి.

 

 

Visitors Are Also Reading