Sir Movie Review in Telugu: తమిళ స్టార్ హీరో ధనుష్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. కోలీవుడ్ లో నటించిన సినిమాలన్ని దాదాపు తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ సారి మాత్రం నేరుగా తెలుగు దర్శకుడితో ‘సార్’ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తమిళ స్టార్ ధనుష్ కాంబోలో తమిళంలో వాతి, తెలుగులో సార్ సినిమాలకు ఏకకాలంలో తెరకెక్కించారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో SIR Movie Review ద్వారా చూద్దాం.
నటీనటులు : ధనుష్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, హైపర్ ఆది తదితరులు.
Advertisement
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం : వెంకీ అట్లూరి
సంగీతం : జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటో గ్రఫీ : జె.యువరాజ్
ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2023
కథ :
ఈ చిత్రానికి సంబంధించిన కథ మొత్తం 1998-2000 కాలంలోనే సాగుతుంది. ఐఏఎస్ అధికారి అయినటువంటి సత్యనారాయణ మూర్తి (సుమంత్ ) దగ్గరకు ఓ వ్యక్తిని వెతుక్కుంటూ వస్తారు కొందరు కుర్రాళ్లు. అసలు ఆ వ్యక్తి ఎవరో కాదు.. తాను ఇంత స్థాయికి రావడానికి కారణమైన లెక్చరర్ బాలగంగాధర్ తిలక్ (ధనుష్) అని తెలుసుకుని అతని గురించి చెప్పడం ప్రారంభిస్తాడు మూర్తి. తన జీవితంలో సీనియర్ లెక్చరర్ అయితే చాలు ఎంతో మందికి చదువు చెప్పవచ్చని భావించే ఓ ప్రైవేటు కాలేజీ జూనియర్ లెక్చరర్ బాలగంగాధర్ తిలక్. దత్తత పేరుతో ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా దెబ్బతీయాలనేది విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ త్రిపాఠి (సముద్రఖని) కోరిక. క్వాలిటీ ఎడ్యూకేషన్ పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తూ.. ప్రభుత్వ కళాశాలలు మూతపడేవిధంగా చేస్తాడు త్రిపాఠి. దీంతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాడని ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు నియంత్రణ కోసం ప్రభుత్వం ఓ జీవోని తీసుకొచ్చేందుకు ఓ నిర్ణయించుకుంటుంది.
Advertisement
ఈ నేపథ్యంలో త్రిపాఠి ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. 2000లో అప్పుడే పుట్టుకొస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఇంజినీరింగ్ కళాశాలల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఓ బిల్లు తీసుకురాబోతుంది. అయితే ప్రైవేటు కళాశాలలు అన్ని కలిసి ప్రభుత్వ కళాశాలలను దత్తత తీసుకొని తమ వద్ద జూనియర్ లెక్చరర్లుగా పని చేస్తున్న కొందరినీ తీసుకెళ్లి లెక్చరర్లుగా నియమిస్తారు. వారిలో బాలా గంగాధర్ తిలక్ అలియాస్ బాలు ఒకరు. కడప జిల్లా సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకి వెళ్తాడు. దత్తత పేరుతో ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేయాలనేది త్రిపాఠి టార్గెట్. కళాశాలలో చదివే విద్యార్థులందరినీ పాస్ చేయించి ప్రమోషన్ సాధించాలనేది బాలు లక్ష్యం. త్రిపాఠి కుట్రను బాలు ఎలా తిప్పి కొట్టాడు.? సిరిపురం ప్రెసిడెంట్ (సాయికుమార్) బాలు సార్ ని ఊరి నుంచి బహిష్కరించినా విద్యార్థులకు క్లాస్ లు ఎలా చెప్పాడు.? తను చదువు చెప్పిన 45 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షలా రాణించారా..? లేదా ? బాలు సార్ కి బయాలజీ లెక్చరర్ మీనాక్షి(సంయుక్త మీనన్) ఎలాంటి సహాయం చేసింది. బాలు సార్ కారణంగా సిరిపురం యువతలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది తెలియాలంటే మాత్రం థియేటర్లలో ఈ సినిమాను వీక్షించాల్సిందే.
Also Read : కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన ఆ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!
విశ్లేషణ :
ఈ సినిమా ప్రారంభంలో కాస్త బోల్డ్ మూవీలా ఓపెన్ చేసిన దర్శకుడు వెంకీ అట్లూరి ఆ తరువాత మాత్రం సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా ముందుకు తీసుకెళ్లాడు. తొలుత మూర్తి ఎవరు అని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించి.. ఓ ఐఏఎస్ అధికారి అని చెప్పాడు. ఆ తరువాత బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు ఎవరనే ఆసక్తి రేకెత్తిస్తాడు. బాలగంగాధర్ తిలక్ క్యారెక్టర్ తో ప్రేమ కథలోకి తీసుకెళ్లాడు. “విద్య అనేది గుడిలో పెట్టిన నైవేద్యం లాంటిది.. పంచండి. అంతేకాని ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లా అమ్మకండి” అని ఇంటర్వెల్ ముందు హీరో ధనుష్ విలన్ తో చెప్పే డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దేశంలో ఎడ్యుకేషన్ మాఫీయా సాగిస్తున్న అరాచకాలు ఏంటి ? ప్రైవేటు విద్యాసంస్థలు చదువుని వ్యాపారంగా మార్చడం వల్ల మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న అవస్థలు ఏంటి అనేది ఈ చిత్రంలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి.
Read More: Tollywood Telugu Cinema News, Telugu News
ఫస్టాప్ పిల్లలకు చదువు పై ఆసక్తి కలిగించేందుకు బాలు చేసిన ప్రయత్నాలు చూపించారు. అదేవిధంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు హైపర్ ఆదితో పాటు మరో తమిళ నటుడు చేసిన కామెడీ ట్రాక్స్ ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సమయానికి ప్రేక్షకులకు సినిమా పై ఆసక్తి కలిగించేలా తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్ లో ఎలా అయిన వారికి చదువు చెప్పాలని ధనుష్ చేసిన ప్రయత్నం, అందుకు పడిన కష్టం అద్భుతంగా చూపించారు. మధ్యలో హీరోయిన్ తో ప్రేమాయణం ఉంటుంది. క్లైమాక్స్ ప్రేక్షకులందరూ ఆలోచిస్తూ.. బయటికి వచ్చే విధంగా డీల్ చేయగలిగాడు దర్శకుడు వెంకీ అట్లూరి.
రేటింగ్ : 3 / 5
Also Read : చిరంజీవి పై కోపంతో సినిమా సెట్ బయటే నిలబెట్టి మరి తిట్టేసిన స్టార్ ప్రొడ్యూసర్ అతడేనా ?