ఎవడు, రోబో 2.0, ఐ వంటి సినిమాలతో హీరోయిన్ గా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైంది బ్రిటీష్ బ్యూటీ అమిజాక్సన్. నటిగా తన కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే.. వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలింది. పెళ్లి కాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తరువాత పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అమీజాక్సన్ బ్రిటీష్ నటుడు ఎడ్ వెస్ట్విక్ తో డేటింగ్ లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై అమీ జాక్సన్ ఏనాడు కూడా రియాక్ట్ కాలేదు.
Advertisement
Advertisement
కానీ తాజాగా ఆ రూమర్స్ నే నిజం చేస్తూ.. ఓ కొత్త ప్రియుడిని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎడ్ వెస్ట్విక్ తో ప్రేమలో ఉన్నట్టు వాలంటైన్స్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించింది అమీజాక్సన్. ఈ సందర్భంగా ఎడ్ వెస్ట్వీక్ తో దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ, నీ అంతు లేని ప్రేమకు కృతజ్ఞతలు అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని జోడించి షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరూ క్యూట్ కపుల్ అంటూ హార్ట్ ఎమోజీలతో స్పందిస్తుంటే.. మరికొందరూ ఆమె తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పెళ్లి కాకుండానే సహజీవనం, బిడ్డకు జన్మినవ్వడం.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం ఏంటని తప్పు బడుతున్నారు. ప్రస్తుతం సోషల్ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.
Also Read : శివాజీ సినిమాలో దర్శకుడు శంకర్ విలన్ గా సుమన్ నే ఎందుకు తీసుకున్నారో తెలుసా ?