Home » Prithvi Shaw : పృథ్వి షాపై దాడి వీడియో బయటకి! తప్పు ఎవరిది?

Prithvi Shaw : పృథ్వి షాపై దాడి వీడియో బయటకి! తప్పు ఎవరిది?

by Bunty
Ad

టీమిండియా క్రికెటర్ పృద్విషా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని రోజులుగా టీమిండియాలో ఛాన్సులు రాక, సతమతమవుతున్నాడు ఈ ప్లేయర్. ఈ తరుణంలోనే ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ కు పృద్వి షా ఎంపికయ్యాడు. అయితే,క్రికెటర్ పృథ్విషాతో అభిమానులు గొడవపడ్డారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఆ ఘటనలో 8 మందిపై కేసును రిజిస్టర్ చేశారు. సెల్ఫీలు ఇచ్చేందుకు పృథ్విషా నిరాకరించడంతో ఆ క్రికెటర్ అభిమానులు అతనిపై దాడిచేశారు.

Advertisement

క్రికెటర్ కారును చేజ్ చేసి, బేస్ బాల్ బ్యాట్ తో అటాక్ చేసారు. ఈ ఘటనకు చెందిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ముంబైలోని ఓషివారాలో ఉన్న ఓ లగ్జరీ హోటల్ వద్ద పృథ్విషాతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. తోలుత కొన్ని సెల్ఫీలు దిగిన కొందరు, మరిన్ని సెల్ఫీలు కావాలంటూ క్రికెటర్ వెంటపడ్డారు. ఆ సమయంలో ఆ అభిమానుల్ని పృథ్విషా నివారించారు. హోటల్ మేనేజర్ ను పిలిపించి ఆ అభిమానుల్ని బయటకు పంపించారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న అభిమానులు క్రికెటర్ ను వెంటాడారు.

Advertisement

ఫ్రెండ్స్ తో కలిసి హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అభిమానులు అటాక్ చేశారు. కారులో వెళ్తున్న పృథ్విని చేజ్ చేసారు. ఆ తర్వాత బేస్ బాల్ బ్యాట్ తోను క్రికెటర్ పై అటాక్ చేసే ప్రయత్నం చేశారు. పృథ్వి నుంచి 50,000 డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. శోబిత్ ఠాకూర్, సప్నా విత్ గిల్ ఆరోపణలను ఖండించారు. పృథ్వినే తమపై ముందుగా దాడి చేసినట్టు వాళ్ళు పేర్కొన్నారు.

Visitors Are Also Reading