Home » ఏటీఎం కార్డుతో రూ.5లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చనే విషయం మీకు తెలుసా ?

ఏటీఎం కార్డుతో రూ.5లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణగా బ్యాంకులో ఖాతా తెరిచినప్పుడల్లా ఆ ఖాతాలో డెబిట్ కార్డు కూడా వస్తుంది. ఇది ఆన్ లైన్ చెల్లింపు నుంచి నగదు ఉపసంహరణ వరకు ప్రజలకు సహాయపడుతుంది. నగదు ఉపసంహరణ కాకుండా.. మనకు సాధారణంగా తెలియని ఏటీఎం కార్డు యొక్క కొన్ని ప్రయోజనాలున్నాయి.ఏటీఎం కార్డుపై లభించే బీమాకు సంబంధించిన ప్రయోజనం చేకూరుతుంది. ఏటీఎం కార్డు పై కస్టమర్లు రూ.25 వేల నుంచి రూ.5 లక్షల బీమా ప్రయోజనం పొందుతారు. 

Advertisement

సామాన్యులకు తరుచుగా తెలియదు. ఈ కారణంగా భారీ ప్రయోజనాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. కనీసం 45 రోజుల పాటు ఏటీఎం కార్డుని ఉపయోగించే వ్యక్తులు మాత్రమే ఏటీఎం కార్డు బీమా ప్రయోజనాన్ని పొందుతారు. ఈ సదుపాయాన్ని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర బ్యాంకు ఏటీఎం కార్డులో చూడవచ్చు. దీంతో పాటు బీమా ప్రయోజనం మీ ఏటీఎం కార్డు కేటగిరిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఏటీఎం కార్డు కేటగిరిని బట్టి బీమా మొత్తం నిర్ణయించబడుతుంది. క్లాసిక్ కార్డుపై రూ.లక్ష ప్లాటినం కార్డుపై రూ.2లక్షలు, మాస్టర్ కార్డుపై రూ.50 వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డుపై రూ.5లక్షలు, వీసా కార్డుపై రూ.1.5 నుంచి రూ.2లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. 

Advertisement

Also Read :  వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. మరో 4 కొత్త ఫీచర్స్ ..!

ప్రధాన్ మంత్రి జన్ ధన్ ఖాతాలో అందుబాటులో ఉన్న రూపే కార్డుతో కస్టమర్లు రూ.1 నుంచి 2 లక్షల బీమా కవరేజీని పొందుతారు. ఒక వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే.. అలాంటి పరిస్థితిలో అతని కుటుంబం రూ.5లక్షల వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు. ఏటీఎం కార్డు దారుడు ప్రమాదంలో మరణిస్తే.. ఆ కార్డు దారుడిని నామిని ఆ వ్యక్తి ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లి పరిహారం కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. బ్యాంకుకు అవసరమైన పత్రాలను సమర్పించిన తరువాత నామినికి బీమా క్లెయిమ్ వస్తుంది. ముఖ్యంగా బ్యాంకు ఏటీెఎం కార్డును ఉపయోగించిన 45 రోజుల్లో మరణం లేదా ప్రమాదం సంభవించినట్టయితే సంబంధిత వ్యక్తిపై ఆధారపడిన వ్యక్తి బీమా పాలసి కింద పరిహారం క్లెయిమ్ చేయవచ్చు. 

Also Read :  మీ పిల్లల ముందు ఈ పనులు అస్సలు చేయకండి..!

 

Visitors Are Also Reading