Home » శాకుంతలం నుంచి వచ్చిన లిరికల్ సాంగ్ విన్నారా..?

శాకుంతలం నుంచి వచ్చిన లిరికల్ సాంగ్ విన్నారా..?

by Anji
Ad

శకుంతలగా అందాల ముద్దుగుమ్మ సమంత, దుష్యంత మహారాజు మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్న పౌరాణిక ప్రేమ కథా చిత్రం శాకుంతలం. ఫ్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్ లవ్ స్టోరీ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ముఖ్యంగా ప్రతీ ఫ్రేమ్ ని అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు గుణశేఖర్ కాళిదాస్ రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాన్ని రూపొందిస్తున్నారు.

Advertisement

శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ శాకుంతలం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. తాజాగా విడుదలైన మధుర గతమ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.మధుర గతమా కాలాన్నే ఆపకా ఆగావే సాగకా..” అంటూ సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ గీతాన్ని శ్రీమణి రచించగా.. ఆర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. 

Advertisement

Also Read :  తెలుగు నుండి ఇండియా వ్యాప్తంగా 10 మంది మోస్ట్ పాపుల‌ర్ స్టార్స్ వీళ్లే..!

Samanatha Ruth Prabhu's Shaakuntalam to now release in 3D; new release date  to be announced soon | Entertainment News,The Indian Express

దుర్వాసుడి శాపంతో దుష్యంతుడి గాంధర్వ వివాాహానికి గుర్తుగా ఇచ్చినటువంటి వస్తువును పోగొట్టుకుంటుంది శకుంతల. ఆ శాపంతోనే తన భార్యని మరిచిపోతాడు దుష్యంతుడు. ఒకరికొకరు దూరమైనప్పుడు శకుంతల మనస్సులోని బాధను వ్యక్తం చేసేది ఈ పాట. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగిళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విజువల్ వండర్ గా టెక్నాలజీతో తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్షేషన్ ని క్రియేట్ చేసాయి. 

Also Read :  ఉపాసన కంటే ఆ హీరోయిన్ ఇష్టమంటూ రామ్ చరణ్ సంచలన కామెంట్స్..!!

Visitors Are Also Reading