Home » Valentine’s Day : భారత కెప్టెన్ రోహిత్ శర్మ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా ?

Valentine’s Day : భారత కెప్టెన్ రోహిత్ శర్మ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

క్రికెట్ మైదానంలో బ్యాట్ ఘాటుగా మాట్లాడే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రేమ మైదానంలో మాత్రం చాలా కూల్ గా డీల్ చేస్తాడు. రోహిత్ లవ్ స్టోరీతో ఓ సినిమానే తీయవచ్చు. సినిమాలోని కథకంటే తక్కువ ఏమి ఉండదు. రోహిత్ భార్య రితికా స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్ గా పని చేసేది. ఇలా వారిద్దరూ కలుసుకున్నారు. ఆ తరువాత క్రమ క్రమంగా కలుసుకోవడం, స్నేహం,  ఆ తరువాత ప్రేమగా మారింది. రితికాతో రోహిత్ దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్ చేశాడు రోహిత్ శర్మ. 

Advertisement

రోహిత్ తన భార్య రితికాకు సినిమా స్టైల్ లో ప్రపోజ్ చేసాడు. అందుకోసం డిన్నర్ కో, డేట్ కో తీసుకెళ్లలేదు. రోహిత్ రితికను బోరివాలి స్పోర్ట్స్ క్లబ్ తీసుకెళ్లి అక్కడ మోకాళ్ల పై కూర్చొని ప్రపోజ్ చేశాడు. 11 ఏళ్ల వయస్సులో రోహిత్ ఈ క్లబ్ లో తొలి మ్యాచ్ ఆడాడు. అందుకే అక్కడికే తీసుకెళ్లి తనను ఇంప్రెస్ చేసాడు.  2015 ఐపీఎల్ రోహిత్ శర్మ ఒకరితో చేస్తున్నారనే చర్చలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. ఆ తరువాత ఇద్దరూ కలిసి వారి సంబంధం గురించి అందరికీ చెప్పేసారు. రోహిత్ 2015 డిసెంబర్ 13న రితికను పెళ్లి చేసుకున్నాడు. రోహిత్ శర్మ భార్య రితికా మాజీ భారత ఆటగాడు యువరాజ్ సింగ్ కి రాఖీ సోదరి. ఇదే వీరిద్దరినీ కలుసుకునేలా చేసిందట. 

Advertisement

Also Read :  Hardik Pandya : ఆ బ్యూటీని రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా?

 

అయితే రోహిత్ మొదటిసారి కలిసినప్పుడు రితికాకు పెద్దగా నచ్చలేదంట. ప్రస్తుతం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. అతని నికర విలువ గురించి మాట్లాడితే.. దాదాపు రూ.160 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. 2015లోనే రోహిత్ వర్లీలో 4 ఎకరాల ఫ్లాట్ ని కొనుగోలు చేసాడు. దాని అంచనా వ్యయం రూ.30కోట్లు అని అంటున్నారు. రోహిత్ శర్మ రితికల జోడికి 2018లో కుమార్తె జన్మించింది. ఇద్దరూ తమ కూతురికి సమైరా అని పేరు పెట్టారు. కూతురు పుట్టిన తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు. ఈ శుభవార్త తెలిసిన వెంటనే భారత్ కి వచ్చి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 

Also Read :   IPL వేలంలో జాక్ పాట్ కొట్టిన కర్నూలు అమ్మాయి

Visitors Are Also Reading