ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పక్షవాతంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ పక్షవాతం అనేది నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. పక్షవాతం వస్తే దాని ప్రభావం శరీరంలోని అన్నీ అవయవాలపై పడుతుంది. పైగా కొందరూ తమ పని కూడా చేసుకోలేనంతగా అంగవైకల్యానికి గురవుతుంటారు. అసలు ఈ పక్షవాతానికి గురికావడానికి కారణాలు ఏమిటి..? ఎవరికి పక్షవాతం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
సాధారణంగా మనకు ఉండే చెడు అలవాట్ల వల్ల పక్షవాతం బారీన పడుతుంటారు. ముఖ్యంగా పరిమితికి మించి మద్యం తీసుకోవడం, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు ఉన్న వారికి పక్షవాతం అధికంగా వస్తుంటుంది. అదేవిధంగా హైకొలెస్ట్రాల్ పేరుకుపోవడం, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, అధిక ఒత్తిడి, హార్ట్ ఫెయిలర్, హార్ట్ స్ట్రోక్ వంటి ఇతర సమస్యలు ఉన్నవారు ఎక్కువగా పక్షవాతానికి గురవుతుంటారు. ఇలాంటి వ్యాధులున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక ఆరోగ్య నియమాలు పాటించాలి.
Advertisement
అంతేకాదు పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ పిల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న వారికి పక్షవాతం రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. అయితే పక్షవాతం లక్షణాలను ముందే గుర్తించి సరైన సమయంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటే గనుక చాలా వరకు దాని నుంచి తప్పించుకోవచ్చు. కానీ దురదృష్టం ఏమిటంటే.. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు పక్షవాతంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల దాని బారిన పడి ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికైనా పక్షవాతం గురించి అవగాహన పొంది దాని బారీన పడకుండా రక్షించుకోండి..!