Home » ఐకాన్ స్టార్ గొప్ప మనస్సు.. ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా..

ఐకాన్ స్టార్ గొప్ప మనస్సు.. ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా..

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనస్సును చాటుకున్నారు. కష్టంలో ఉన్న తన అభిమాని కోసం ముందుకు వచ్చి సహాయం అందించారు. వారికి కావాల్సిన ఆర్థిక సాయం అభిమాని కుటుంబంలో సంతోషాన్ని నింపారు. అర్జున్ కుమార్ అనే అల్లు అర్జున్ అభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందిపడుతున్నాడు. ట్రీట్ మెంట్ కోసం దాదాపు రూ.2లక్షలు ఖర్చవుతుండగా.. ఆ కుటుంబానికి అంత ఆర్థిక స్థోమత లేదు. అల్లు అర్జున్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. తమ క్లబ్ సభ్యుడు ఒకరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని పోస్ట్ చేశారు. 

Advertisement

అలా ఈ విషయం అల్లు అర్జున్ వరకు చేరడంతో ట్రీట్ మెంట్ కి ఎంత ఖర్చవుతుందో తెలుసుకోమని దానిని తాను చెల్లిస్తానని చెప్పారు. “ నాకు సాయం చేసిన నా హీరో అల్లు అర్జున్ కి థాంక్స్. మీరు చేసిన సాయానికి నా వంతుగా వ్యక్తి గతంగా ధన్యావాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను” అని  అల్లు అర్జున్ అభిమాని  సంతోషం వ్యక్తం చేసాడు. మరోవైపు ఓ అభిమాని కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నదని తెలియగానే వెంటనే స్పందించి సాయం చేసిన అల్లు అర్జున్ ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఎంతైనా బన్నీది చాలా గొప్ప మనసు అంటూ కామెంట్స్ పోస్ట్  చేస్తున్నారు.  

Advertisement

Also Read :  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిగ్ షాక్.. ఆ సినిమా రీమేక్ గా ‘ఓజి’?

Manam News

గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్నాడు అల్లు అర్జున్. రెండు, మూడు సినిమాలు మినహా ఇప్పటివరకు నటించిన సినిమాలన్ని మంచి సక్సెస్ సాధించిన హీరోగా పేరు సంపాదించాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప 2 సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవలే సెట్స్ పైకి వచ్చి షూటింగ్  శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ రూలింగ్ కనిపించనుందట. 

Also Read :  మీ రిలేషన్ షిప్ లో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

Visitors Are Also Reading