Home » హీరో సుమంత్ తో మంచు లక్ష్మి… డార్లింగ్ అంటూ పోస్ట్!

హీరో సుమంత్ తో మంచు లక్ష్మి… డార్లింగ్ అంటూ పోస్ట్!

by Bunty
Ad

మోహన్ బాబు నట వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి మంచు లక్ష్మి, విదేశాల్లో చదువుకుంది. అలాగే హాలీవుడ్ సీరియల్స్ లో కూడా నటించారు మంచు లక్ష్మి. ఆ తర్వాత తెలుగు సినిమాపై ఉన్న ఆసక్తితో తిరిగి హైదరాబాద్ కు వచ్చానని లక్ష్మీ అనేక సందర్భాలలో చెప్పారు. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించిన మంచు లక్ష్మీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా గుండెల్లో గోదారి సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement

ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది.  కానీ మంచు లక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇది ఇలా ఉండగా, ఎవరేమనుకున్నా అనుకున్నది పక్కాగా చేసే మంచు లక్ష్మి తాజాగా హీరో సుమంత్ కు ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ తెలుపుతూ ట్విట్ చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. డార్లింగ్ సుమంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు,

Advertisement

మరో మంచి ఏడాది నీ ముందు ఉంది అంటూ సుమంత్ తనను వెనుక నుంచి వాటేసుకున్న ఫోటోను షేర్ చేసింది మంచు లక్ష్మి. అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్లు, ‘మోహన్ బాబు గారు ఎప్పుడు డిసిప్లిన్ అంటారు. ఇలాగే ఉంటదా డిసిప్లిన్, గుడ్ వెరీ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీ, యాక్ తూ’ అని కామెంట్ చేస్తున్నారు. అలాగే హాట్ అండ్ హాట్ గా కనిపిస్తున్నారు మేడమ్ అని మంచు లక్ష్మీ పోస్టుకు రిప్లై ఇస్తున్నారు.

READ ALSO : Amigos Movie Review : “అమిగోస్” రివ్యూ..కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ !

Visitors Are Also Reading