సాధారణంగా కొంత మందికి maద్యం లేకుండా ముద్ద దిగదు. ఇంట్లో ఏ వేడుకలు నిర్వహించినా తప్పనిసరిగా అది ఉండేలా చూసుకుంటారు. బంధువులు కూడా సుక్క, ముక్క ఉన్న ఫంక్షన్లకే ఎక్కువగా వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది ఇంట్లో అయితే ఎవ్వరికీ ఏది నచ్చింది అది ఉంటుంది. రకరకాల బ్రాండ్స్ తీసుకొస్తుంటారు. మరికొందరూ ప్రత్యేకంగా రెస్టారెంట్ లోనే పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక రెస్టారెంట్ లో మాత్రం ఆల్క*ల్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ నావికదళ అధికారులకు మాత్రం ఆల్క*ల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. వారి ధర గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో ఓ ఫోటో నేవీ ఆఫీసర్స్ కి సంబంధించిన మెను చూపిస్తుంది. ఈ ఫోటోతో సోషల్ మీడియా వినియోగదారులు అందరూ ఆశ్యర్యపోతున్నారు.
Advertisement
Advertisement
అనంత్ అనే ట్విట్టర్ వినియోగదారుడు మెస్ నుంచి మెన్ కి సంబంధించిన ఫోటోను పంపించేందుకు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ వద్దకు వెళ్లారు. అతను పంపించిన మెనులో చాలా బ్రాండ్లు తక్కువ ధరకే విక్రయించబడుతున్నాయి. ఈ మెను ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా సైనిక సిబ్బందికి సెంట్రల్ ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఉంటుంది. మిలిటరీ క్యాంటీన్లలో మద్యం, కిరాణా వస్తువులు కనీసం 10 నుంచి 15 శాతం వరకు చౌకగా ఉంటాయి. ట్విట్టర్ లో చేసిన ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటివరకు దాదాపు 30K వరకు వీక్షించగా.. చాలా లైక్ లు, కామెంట్స్ వచ్చాయి. ఓ నెటిజన్ హా.. హా.. అని నవ్వుతూ ఇది DSOI మెను మాదిరిగా ఉందని పేర్కొన్నాడు.
మరో నెటిజన్ ఇలా స్పందించాడు. ఒకసారి “నేను నా ఫౌజీ మామ గారిని డ్రింక్ కోసం ముంబైలోని ఒక సాధారణ బార్ అండ్ రెస్టారెంట్ కి తీసుకెళ్లినట్టు నాకు గుర్తు చేస్తుంది” అని పేర్కొన్నాడు. 60Ml ధరలు అస్సలు నమ్మలేని విధంగా ఉన్నాయని మరో నెటిజన్ ప్రశ్నించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇలాంటి ధరలు లభిస్తాయి. కానీ కేవలం ఇది సభ్యులకు మాత్రమే ఉండే క్లబ్. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ ధరలను చూసి సాధారణ maద్యం ప్రియులు సాధారణంగా కూడా ఇలా తక్కువ ధరకు ఉంటే ఎంత బాగుండు అని కూడా కొందరూ కామెంట్స్ చేయడం విశేషం.
Also Read : గ్రీన్ టీలో వీటిని యాడ్ చేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు..!