Home » Jr:ఎన్టీఆర్ పై బాలకృష్ణకు అంత పగా ..కావాలనే దూరం పెడుతున్నారా..?

Jr:ఎన్టీఆర్ పై బాలకృష్ణకు అంత పగా ..కావాలనే దూరం పెడుతున్నారా..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని నందమూరి ఫ్యామిలీ నుండి హరికృష్ణ,బాలకృష్ణ,కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ఎదిగారు.. ఇందులో బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోలుగా మారారు. ఇక నిజం చెప్పాలి అంటే నందమూరి బాలకృష్ణ కంటే ఎన్టీఆర్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఎన్టీఆర్ ఇంతటి స్టార్డం తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు.. చాలా సంవత్సరాల వరకు ఫ్యామిలీ సపోర్ట్ దొరకలేదు. అయినా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా కష్టపడుతూ ముందుకు వెళ్లి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారారు.

Advertisement

Also read:రామలింగయ్య లేకుంటే చిరును ఎన్టీఆర్ తొక్కేసేవారా.. జరిగింది ఏంటంటే ..?

Advertisement

అలాంటి ఎన్టీఆర్ ను బాబాయ్ బాలకృష్ణ ప్రతి విషయంలో దూరం పెడుతూ వస్తున్నారట. వారి మధ్య చాలా రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకానొక సమయంలో బాలకృష్ణ ఇండైరెక్టుగా ఎన్టీఆర్ ను కూడా తిట్టడం జరిగింది. ఒక సీనియర్ జర్నలిస్టు కూడా జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ కావాలనే అవమానిస్తున్నారని రాసుకొచ్చారు. అయితే ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, బాలకృష్ణ వారిద్దరినీ బయటకు వెళ్ళమని చెప్పారట. ఆ అవమానాన్ని తట్టుకోలేక జూనియర్ ఎన్టీఆర్ తన తల్లిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.

తనకు ఎప్పుడైతే స్టార్డం వచ్చిందో బాలకృష్ణ స్వయంగా తన సినిమా ఫంక్షన్లకు పిలవడం మొదలుపెట్టారు. ఈ విషయం జరిగి చాలా రోజులు అవుతున్నప్పటికీ తాజాగా ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం ఎన్టీఆర్ కి బాలకృష్ణ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ విధంగా ఏదోరకంగా ఎన్టీఆర్ ను తన బాబాయి దూరం పెడుతూ వస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు అలా దూరం పెట్టడం సరి కాదంటూ బాలకృష్ణపై మండిపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Also Read:కూతురు హీరోయిన్ ఎంట్రీకి శంకర్ మొదట ఎందుకు ఒప్పుకోలేదు…? కానీ చివరికి ఎలా ఒప్పుకున్నారంటే..?

Visitors Are Also Reading