Telugu News » Blog » టాలీవుడ్ లో చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తొక్కేయకుండా కాపాడిన స్టార్ ఎవరంటే ?

టాలీవుడ్ లో చిరంజీవి స్టార్ గా ఎదుగుతున్న సమయంలో తొక్కేయకుండా కాపాడిన స్టార్ ఎవరంటే ?

by Sravanthi Pandrala Pandrala
Ads

ఈ తరం హీరోలలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. అలాంటి చిరంజీవి సాధారణ నటుడిగా ఉన్న సమయంలో మాత్రమే ఆయన పెద్ద స్టార్ అవుతారని గ్రహించిన అల్లు రామలింగయ్య చిరంజీవి తన కూతురు సురేఖ ని ఇచ్చి వివాహం చేశారు. ఆయన అనుకున్నట్టుగానే చిరంజీవి ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు.. చాలా వరకు ఇండస్ట్రీలో ఎక్కువగా చౌదరీలు ఉండేవారు.

Advertisement

Also Read:కూతురు హీరోయిన్ ఎంట్రీకి శంకర్ మొదట ఎందుకు ఒప్పుకోలేదు…? కానీ చివరికి ఎలా ఒప్పుకున్నారంటే..?

అప్పటికి ఇప్పటికీ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ నిర్మాతలు గాని కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులే ఇండస్ట్రీని శాసించేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో చిరంజీవి హీరోగా మంచి స్థాయికి ఎదుగుతున్నారు. చిరంజీవి కంటే ముందే బాలకృష్ణ ఇండస్ట్రీలో హీరోగా ఉన్నారు. ఈ క్రమంలో చిరంజీవి తప్ప మిగతా వారంతా కమ్మ కులాలకు చెందిన వారే. దీంతో చిరంజీవిని ఎక్కడైనా తొక్కిస్తారేమోనన్న భయంతో చాలా జాగ్రత్తగా ఒక్కోమెట్టు ఎక్కించారట అల్లు రామలింగయ్య. చిరంజీవిని పిలిచి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల కల్లా ఎన్టీఆర్ గారి ఇంటి బయట గేటు దగ్గర నిలబడి ఉండమని చెప్పారట అల్లు రామలింగయ్య..

Advertisement

అప్పుడు 9999 అనే వైట్ అంబాసిడర్ లో ఎన్టీఆర్ బయటకు వస్తారు. వెంటనే ఆయనకు నమస్కారం చేయమని చెప్పారట. దీనివల్ల ఆయనకు మనకుర్రాడే పైకి వస్తాడనే ఆలోచన కలుగుతుందనేది అల్లు రామలింగయ్య ఆలోచన. ఈ విధంగా చిరంజీవి మామ చెప్పిన విధంగానే చాలా కాలం పాటు ఎన్టీఆర్ కి గుడ్ మార్నింగ్ చెప్పేవారట. ఓసారి వరదలు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ వరద ప్రాంతాలకు సందర్శించడానికి వెళ్లారు. ఆ టైంలో చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోని ఎన్టీఆర్ చిరంజీవి ఒకరికి ఒకరు ఎదురుపడ్డారట. ఆ టైంలో చిత్ర బృందాన్ని కలిసి ఎన్టీఆర్ ఏం బ్రదర్ మీ సినిమా తుఫాన్ లో కూడా కలెక్షన్స్ సృష్టిస్తుందని ప్రశంసించారట ఎన్టీఆర్.

Advertisement

Also Read:దూకుడు, 100 % లవ్ సహా యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ చేసిన సినిమాలు ఇవే…!