Home » కూతురు హీరోయిన్ ఎంట్రీకి శంకర్ మొదట ఎందుకు ఒప్పుకోలేదు…? కానీ చివరికి ఎలా ఒప్పుకున్నారంటే..?

కూతురు హీరోయిన్ ఎంట్రీకి శంకర్ మొదట ఎందుకు ఒప్పుకోలేదు…? కానీ చివరికి ఎలా ఒప్పుకున్నారంటే..?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలోకి హీరోలు, దర్శకుల వారసులు రావడం కామన్. అయితే ఒకప్పుడు కేవలం హీరోలు, దర్శకులు, నిర్మాతల కుమారులు మాత్రమే హీరోలుగా ఎంట్రీ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. కేవలం కుమారులే కాకుండా కూతుళ్ళు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకులు, నిర్మాతలు హీరోల కూతుళ్ళు కూడా హీరోయిన్ లుగా పరిచయం అవుతున్నారు.

Advertisement

 

ఇక ప్రస్తుతం ఇండియా లోని టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయిన శంకర్ కుమార్తె అదితి కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. డైరెక్టర్ శంకర్ కు మొత్తం ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె పేరు అదితి కాగా సినిమాల్లో స్టార్ హీరోయిన్ అవ్వాలని అదితి కలలు కన్నారు. అయితే అదితి హీరోయిన్ అవుతా అంతే మొదట శంకర్ నో చెప్పారట.

Advertisement

ఈ విషయాన్ని అదితి ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది. హీరోయిన్ గా సక్సెస్ అవ్వకపోతే తన కూతురు కెరీర్ నాశనం అవుతుందని శంకర్ నో చెప్పారట. కానీ ఒకవేళ తాను హీరోయిన్ గా సక్సెస్ అవ్వకపోతే చదువుకున్న వైద్య వృత్తి లో కొనసాగుతా అని అదితి చెప్పారట. అలా చెప్పడం తో శంకర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అలా అదితి మొదట విరుమాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించాడు. నిజానికి శంకర్ మొదట బయపడ్డా దర్శకుడు, హీరో లను చూసే తన కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఇది కరెక్ట్ సినిమా అని నిర్ణయం తీసుకున్నారు.

Also read : Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్..స్ట్రీమింగ్ ఎందులో అంటే !

Visitors Are Also Reading