హీరోయిన్ విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. బిజెపిలో తెలంగాణ నుండి కీలక నేతగా విజయశాంతి వ్యవహరిస్తోంది. అంతేకాకుండా భరత్ అనే నేను సినిమాతో విజయశాంతి సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మాత్రం మరో సినిమాలో కనిపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి తన సినిమా కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Advertisement
ఇప్పటివరకు దాదాపు 180 సినిమాలలో నటించినట్టు విజయశాంతి వెల్లడించింది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేసినట్టు తెలిపింది. వాటిలో లేడీ ఓరియంటెడ్ సినిమాలే తనకు ఎక్కువ ఇష్టమని చెప్పింది. చిన్న వయసులోనే తన తండ్రి గుండెపోటుతో మరణించారని చెప్పింది. తాను చిన్ననాటి నుండి ఎవరి మీద ఆధారపడకుండా బతికానని తెలిపింది.
Advertisement
పెళ్లి కూడా తానే చేసుకున్నానని చెప్పింది. అంతేకాకుండా తన మొదటి రమ్యునరేషన్ 5000 అని కానీ అందులో కొంత ఎగ్గొట్టి 3000 ఇచ్చారని చెప్పింది. 3,000 నుండి కోటి రూపాయలు తీసుకునే స్థాయికి తాను ఎదిగానని వెల్లడించింది. ఆ కాలంలో ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న టాప్ సినిమా తారలతో తాను కూడా పోటీపడ్డానని చెప్పింది. అంతేకాకుండా తాను సినిమాల కోసం చాలా కష్టపడ్డానని చెప్పింది. ఓ సినిమా కోసం కదులుతున్న రైలు నుండి పక్క కంపార్ట్మెంట్ కు వెళ్లాలని.. ఆ సమయంలో జస్ట్ మిస్ అయితే కింద పడేదాన్ని అని చెప్పింది.
అంతేకాకుండా తమిళ సినిమా షూటింగ్ లో తనను కుర్చీలో బంధించి గుడిసెకు నిప్పు పెట్టే సన్నివేశం ఉందని…. దానికోసం తనను తాళ్ళతో కట్టేసారని చెప్పింది. ఇక గుడిసెకు నిప్పు పెట్టారని గాలి ఎక్కువ వీయడంతో తన చీరకు అంటుకుందని చెప్పింది. అది చూసి హీరో విజయ్ కాంత్ వెంటనే లోపలికి వచ్చి తనను కాపాడారని… అలా చాలాసార్లు చావు చివరి అంచుల వరకు వెళ్లానని వెల్లడించింది.
Also read :వెంకటేష్ కోసం రిజిస్ట్రేషన్ చేసిన టైటిల్ చిరంజీవికి ఎలా వచ్చిందో తెలుసా ?