Home » భార్య, భర్త మధ్యలో ప్రియుడు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

భార్య, భర్త మధ్యలో ప్రియుడు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా మనం చాలా లవ్ స్టోరీలు చేస్తుంటాం. రకరకాలుగా ట్విస్ట్ లు, గొడవలు ఉంటాయి. కానీ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆ భార్యకు భర్త వద్దు. కానీ ప్రియుడే కావాలి.  ఆ భర్తకు మాత్రం భార్యనే కావాలి. పోలీసుల ముందుకు వచ్చింది ఈ వింత పంచాయతీ. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. చివరకు ముస్లిం మత పెద్దల దగ్గరకు చేరింది. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వివాహిత.. భర్తను వదిలించుకునేందుకు పక్కా ప్లాన్ వేసింది. ‘టీ’లో నిద్రమాత్రలు కలిపిచ్చి బంగారం, నగదు తీసుకొని ప్రియుడితో పరారు అయింది.

Advertisement

ఇక రెండు రోజుల తర్వాత మత్తు వీడిన భర్త.. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. 7 నెలల కిందట వీరికి వివాహం జరిగింది. అయితే తనకు అసలు ఈ పెళ్లి అంటేనే ఇష్టం లేదని తాను మరొకరిని ప్రేమిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పిన బలవంతంగా పెళ్లి చేశారని అంటోంది. ఇంత జరిగినప్పటికీ  తనకు మాత్రం భార్య కావాలంటున్నాడు భర్త. తాను ఇప్పటివరకు ఏం చేసినా పట్టించుకోనని చెప్పడం విశేషం.

Advertisement

Manam News

కానీ భర్తతో వెళ్లేందుకు భార్య ససేమీరా అంటోంది. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ముస్లిం మత పెద్దల దగ్గరే తేల్చుకోమని పంపించారు. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. మత పెద్దలు చెప్పినా లెక్క చేయలేదు ఆలియా. ప్రియుడే ముద్దు.. భర్త వద్దేవద్దంటూ తెగేసి చెప్పేస్తుంది. అటు భర్త.. ఇటు భార్య వినకపోవడంతో ఏం చేయాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు మత పెద్దలు. మరీ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.

Also Read :  ఈ అందమైన జలపాతం వెనుక దాగి ఉన్న హిస్టరీ గురించి మీకు తెలుసా ?

Visitors Are Also Reading