Home » వాషింగ్టన్ సుందర్… పేరు వెనక ఇంత రహస్యం ఉందా? అతనికి చెవులు కూడా వినిపించవు !

వాషింగ్టన్ సుందర్… పేరు వెనక ఇంత రహస్యం ఉందా? అతనికి చెవులు కూడా వినిపించవు !

by Bunty
Published: Last Updated on
Ad

వాషింగ్టన్ సుందర్, గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2001లో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్. సంచలన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ ను అవుట్ చేసిన తీరు అర్థసెంచరీతో టీమ్ ఇండియాను గెలిపించిన విధానం అందరిని ఆకట్టుకున్నాయి. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ 2023లో భాగంగా జరిగిన మొదటి టీ20లో బౌలింగ్ లో రెండు వికెట్లు బ్యాటింగ్ లో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు సుందర్.

Advertisement

Advertisement

ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సుందర్ కు ఒక చెవు అసలు వినిపించాదట.  చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉందట. అయితే,వినికిడి లోపం ఉన్నప్పటికీ సుందర్ ఆల్ రౌండర్ గా రాణిస్తూ ఉండడం యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకమని ప్రశంసలు వెళ్ళు వెత్తుతున్నాయి. ఇక సుందర్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే వాషింగ్టన్ సుందర్ పేరు వినగానే అతను క్రిస్టియన్ ఏమోనని చాలామంది భావిస్తారు.

 

అయితే అతను సాంప్రదాయ తమిళ హిందూ కుటుంబానికి చెందిన వాడని సుందర్ తండ్రీ క్లారిటీ ఇచ్చారు. ‘సుందర్ చిన్నతనంలో మేము ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాం. ఆ సమయంలో పిడి వాషింగ్టన్ అనే ఓ సైనికుడు మా కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకున్నాడు. ఆ కృతజ్ఞతతోనే మా అబ్బాయికి వాషింగ్టన్ పేరును జోడించాం’ అని స్పష్టతనిచ్చారు సుందర్ తండ్రి.

READ ALSO : అంబానీ కొడుకు మళ్లీ బరువు పెరగడానికి కారణం ఏంటో తెలుసా! తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.

Visitors Are Also Reading