Home » Taraka Ratna : తారక రత్నకు మెలేనా..ఈ వ్యాధి కారణాలు, లక్షణాలు ఇవే

Taraka Ratna : తారక రత్నకు మెలేనా..ఈ వ్యాధి కారణాలు, లక్షణాలు ఇవే

by Bunty
Published: Last Updated on
Ad

ఎన్టీఆర్ మనవడు అయిన నందమూరి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. హీరో నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య స్థితిపై మరో అప్డేట్ అందింది.

Advertisement

అరుదైన వ్యాధి అయిన మెలేనా తో తారకరత్న బాధపడుతున్నారని, అక్కడి వైద్య బృందం ప్రకటించి0ది. జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలేనా స్థితిగా పేర్కొంటారు. సాధారణంగా మెలేనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటు నోరు, అన్నవాహిక కడుపు, చిన్నప్రేగు మొదటి భాగం బ్లీడింగ్ సంభవిస్తుంది.

మెలేనా కారణాలు :

ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బతినడం. కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం, కడుపులో పుండు, రక్తనాళాలు వాపు, లేదంటే రక్తస్రావం, రక్త సంబంధిత జబ్బుల వల్ల మేలేనా సంభవిస్తుంది.

Advertisement

మెలేనా లక్షణాలు,

మెలీనా వల్ల మనం నల్లగా, బంక మాదిరి స్థితిలో బయటకువస్తుంది. విపరీతమైన దుర్వాసన వస్తుంది. హిమటోచేజియా స్థితికి మెలేనాకు ఎలాంటి సంబంధం ఉండదు. మేలేనా వల్ల శరీరంలో రక్తస్థాయి తగ్గిపోతుంది. అనీమీయాతో పాటు బలహీనంగా మారిపోతారు. ఒక్కోసారి విశ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం లేత రంగులోకి మారిపోవడం, అలసట, విపరీతమైన చెమటలు, ఉన్నట్లుండి కుప్పకూలిపోవడం, గందరగోళం నెలకొనడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. రక్తం తక్కువగా పోయే స్థితిలో, చిన్నప్రేగులో రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి, నోటి నుంచి రక్తం పడడం, బలవంతంగా మింగడం, అజీర్తి, రక్తపు వాంతుల లక్షణాలు కనిపిస్తాయి.

READ ALSO : TarakaRatna : తారక రత్న హెల్త్ బులిటెన్ సరికొత్త విషయాలను బయటపెట్టిన వైద్యులు !

Visitors Are Also Reading