Home » Sakshi Shivanand : “మాస్టర్” సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

Sakshi Shivanand : “మాస్టర్” సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

by Bunty
Ad

 

సినిమా ఇండస్ట్రీ లోకి చాలామంది నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే అందులో కొంతమంది మాత్రమే ఎక్కువ కాలం రాణిస్తూ ఉంటారు. చాలామంది రెండు, మూడు సినిమాలు చేసి ఆ తర్వాత సరైన ఆఫర్లు లేకపోవడంతో కనుమరుగు అవుతుంటారు. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా సరైన ఆఫర్లు లేకపోతే ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే.

Advertisement

అలా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన భామల్లో సాక్షి శివానంద్ ఒకరు. అప్పట్లో తన అందంతో, వయ్యారంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ భామ. మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది సాక్షి. ఆ తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా నటించింది ఈ భామ. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన సాక్షి శివానంద్, 2014 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. సాక్షి శివానంద్ 1996లో బాలీవుడ్ లో అడుగు పెట్టారు.

Advertisement

ఆమె కెరీర్ ప్రారంభంలో ఆమె ఆదిత్య పంచోలి నటించిన జంజీర్ (1998) లో నటించింది. ఆ తర్వాత ఆమె కొద్ది కాలంలోనే టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో సడన్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో హీరోయిన్ గా నటించింది సాక్షి. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా అసలు గుర్తుపట్టలేరు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ ఫోటోలు మీరు చూసేయండి.

READ ALSO : రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !

Visitors Are Also Reading