టిడిపి నేత నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో యువగలం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో సినీ నటుడు తారకరత్న కూడా పాల్గొన్నారు. తారకరత్న కొంత దూరం నడిచిన తర్వాత ఒక్కసారిగా పడిపోయారు. వెంటనే తారకరత్నను సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పపత్రికి తరలించి చికిత్స అందించారు.
Advertisement
అప్పటికే తారకరత్న పల్స్ పడిపోయినట్టు కూడా వైద్యులు వెల్లడించారు. ఇక వెంటనే అక్కడ నుండి పట్టణంలోని పిఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ లు తారకరత్న గుండెలో ఎడమవైపు 90% బ్లాకులు ఉన్నాయని గుర్తించారు. వెంటనే ఆంజియోగ్రామ్ నిర్వహించారు. ఆ తర్వాత తారకరత్నకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి నుండి వైద్యులను మరియు అత్యాధునిక వైద్య పరికరాలను రప్పించారు.
Advertisement
ప్రస్తుతం తారకరత్నకు నారాయణ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. కాగా తాజాగా తారకరత్న హెల్త్ అప్డేట్ వచ్చింది. తారకరత్న కు మరోసారి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కు కృత్రిమ గుండె ను అమర్చే ఆలోచనలో వైద్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తారకరత్నకు హార్ట్ ఎటాక్ రావడం తో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also read : Unstoppable 2 : పవన్ కళ్యాణ్ ప్రోమో చూశారా..?