జానపద పాటలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సింగర్ మంగ్లీ మాత్రమే. తను ఏ పాట పాడిన తప్పనిసరిగా సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఆమె గొంతులో ఏముందో ఏమో కానీ ఆమె పాట వింటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి మంగ్లీ మామూలు న్యూస్ ఛానల్ యాంకర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి ఎన్నో ఆపసోపాలు పడి జానపద పాటలు పాడుకుంటూ గాయకురాలిగా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సింగర్లలో మంగ్లీ కూడా ఒక స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకుంది.
Advertisement
also read:46 ఏళ్ల క్రితమే చావు నుంచి తృటిలో తప్పించుకున్న జమున.. జరిగిందేంటంటే..?
Advertisement
ఆమె ఇప్పటివరకు పాడిన పాటల్లో చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె పాటలు పాడడమే కాదు యాంకరింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. ఈ విధంగా మంగ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆదరణ సంపాదించుకుంది. మైక్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ భారీగానే సంపాదిస్తుందని చెప్పవచ్చు. ఆమె ఒక్క పాట పాడితే మిలియన్ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. తన కెరియర్ మొదట్లో ఈమె ఒక పాట పాడాలంటే 20000 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే వారట.
ప్రస్తుతం ఈమె స్టార్ సింగర్ గా మారడంతో తన పారితోషకం కూడా భారీగానే పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఒక్క పాటకు 2 లక్షల పైగానే తీసుకుంటుందని సమాచారం. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదిస్తుందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలోనే జగన్ ప్రభుత్వం మంగ్లీకి టీటీడిలో ఒక కీలక పదవిని అప్పగించారు. ఈ విధంగా మంగ్లీ గుర్తింపు సాధించడమే కాకుండా సంపాదనలో కూడా దూసుకుపోతోంది.
also read: