Senior Actress Jamuna: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే చాలామంది ప్రముఖ దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది మరణిస్తే, మరికొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి జమున కన్నుమూశారు. హైదరాబాదులోని ఆమె నివాసంలో కన్నుమూశారు.
read also : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !
Advertisement
జమున 1936 ఆగస్టు 30న హంపిలో జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. ఆమె తొలి చిత్రం పుట్టిల్లు. రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది. ఎన్ని పాత్ర ల్లో నటించినా మనకు బాగా పేరు తెచ్చింది మాత్రం సత్యభామ క్యారెక్టర్. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము అన్నట్టుగా జీవించారు జమున.
Advertisement
జమున పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. సత్యభామ కళాపంతో ప్రేక్షక జన హృదయాల్లో విహరించారు. చిన్ననాటి నుంచే నాటకాలతో నటనకే ఆభరణంగా మారారు. తర్వాత అంచలంచలుగా ఎదిగి 198 సినిమాల్లో నవరసనటన సామర్థ్యం కనబరిచారు. జమున దక్షిణాది భాషకు అన్నింటితో పాటు పలు హిందీ సినిమాల్లోని నటించి భళా అనిపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. ఇక నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
READ ALSO : బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన ఎస్వీఆర్ మనవాళ్లు