ప్రేమించడం మోజు తీరగానే ముఖం చాటేయడం. ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ప్రేమించి వదిలేయడమే కాకుండా పెళ్లి చేసుకుని ఆ తరవాత కాపురం చేసి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వదిలేస్తున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ డాక్టర్ తన పాడుబుద్ది చూపించాడు. తన ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు నే ప్రేమించాడు.
Advertisement
డాక్టర్ మాయమాటలకు నమ్మిన ఆ నర్సు పెళ్లి కూడా చేసుకుంది. ఇక పెళ్లి తరవాత ఇద్దరికీ ఓ కూతురు పుట్టింది. కాగా బిడ్డ పుట్టిన తరవాత డాక్టర్ నర్సును వదిలేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక లోని యశ్వంత్పుర లో చోటు చేసుకుంది. గిరీష్ అనే యువకుడు బిఎంఎస్ పూర్తి చేసి సొంత గ్రామం లో క్లినిక్ ను పెట్టుకున్నాడు.
Advertisement
ఇక అదే గ్రామంలో త్రివేణి అనే యువతి గిరీష్ దగ్గర నర్సు గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తరవాత పెద్దలు పెళ్లికి నో చెప్పడంతో ఆలయం లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం కలిసి కాపురం కూడా చేశారు. వీరికి ఒక పాప పుట్టింది. అయితే కొంత కాలంగా గిరీష్ తన భార్య త్రివేణి కి దూరంగా ఉంటున్నాడు. అంతే కాకుండా భార్య ను విడిచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన భర్త మోసం చేశాడని త్రివేణి పోలిసులకు ఫిర్యాదు చేసింది.
Also read : బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి దిగిన ఎస్వీఆర్ మనవాళ్లు