Home » అప్పుడు ట్రైన్, ఇప్పుడు తంతే కారు వెనక్కి వెళ్ళింది! అసలు విషయం చెప్పిన గోపీచంద్

అప్పుడు ట్రైన్, ఇప్పుడు తంతే కారు వెనక్కి వెళ్ళింది! అసలు విషయం చెప్పిన గోపీచంద్

by Bunty
Published: Last Updated on

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేశారు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో గోపీచంద్ మలినేని, బాలకృష్ణతో వీరసింహారెడ్డి చేసే ఛాన్స్ ను అందుకున్నాడు. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో వీరసింహారెడ్డి సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక అభిమానుల అంచనాలను రీచ్ అయ్యేలా గోపీచంద్ మలినేని సైతం బాలయ్య కోసం కథను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే వీరసింహారెడ్డి హిట్ అయింది.అయితే, ఈ సినిమాలో ఓ సీనులో భాగంగా కారును బాలయ్య తంతే అది వెనక్కివెళ్తుంది. అప్పట్లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడులో ట్రైన్ కూడా ఇలాగే వెనక్కి వెళ్తుంది. దీంతో ఈ రెండు సీన్లను పోలుస్తూ నెటిజన్లు దర్శకుడు, నటుడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించారు.

ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చారు. ఆ సీనులో విలన్లు కారులో ఆల్రెడీ రివర్స్ గేర్ వేసి ఉంటారు. కానీ టైర్లు బురదలో ఇరుక్కుపోవడం వల్ల కారు వెనక్కి వెళ్లలేదు. ఇక అదే సమయంలో బాలయ్య కారును తంతాడు. దీంతో బురదలో ఉన్న టైర్లు బయటకు వస్తాయి. అప్పుడు కారు ఎలాగూ రివర్స్ గేర్ లో ఉంది కనుక వెనక్కి వెళ్తుంది. ఇది అసలు విషయం. ఇందులో ట్రోల్ చేయాల్సిన పనిలేదని గోపీచంద్ అన్నారు.

READ ALSO : RRR : “నాటు, నాటు” పాట డ్యాన్స్ మాస్టర్ గురించి తెలుసా? అతను ఓ టైలర్ షాప్ ఓనర్

Visitors Are Also Reading