తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్నటువంటి స్టార్ కమెడియన్ లో ఏవీఎస్ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తన ముఖ కదలికలతో డైలాగ్ డెలివరీతో ఏ పాత్ర ఇచ్చిన అద్భుతంగా నటించేవాడు. ఆ పాత్రతోనే నవ్వులు తెప్పించేవారు. తెనాలిలో పురోహిత్యం చేసే ఏవీఎస్ ఆ తర్వాత విజయవాడలో విలేకరిగా కూడా పని చేశారు. ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న ఆయన తన ఆకలిని అదుపు చేసుకునేందుకు కిల్లి నమీలేవారట.
Advertisement
also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలుంటాయి
డబ్బుల కొరకు తనకు తెలిసిన విద్య అయిన మిమిక్రీ షోలు చేస్తూన్న సమయంలో అప్పట్లో దిగ్గజ దర్శకుడు బాపు ఆయన్ను చూసి మిస్టర్ పెళ్ళాం మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలో నటించాడు. అలా తిరుగులేని నటుడిగా పేరుపొందిన ఆయన 750 పైగా చిత్రాలు చేశారు. టైమింగ్ తగ్గట్టు కామెడీతో ఆకట్టుకునే ఏవీఎస్ మావిడాకులు, సిసింద్రీ, ఆవిడ మా ఆవిడే, మాయలోడు,ఘటోత్కచుడు, జయం మనదేరా, అదిరిందయ్యా చంద్రం, యమగోల,బెండ్ అప్పారావు, బంగారం, శ్రీరామదాసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. రాజకీయాల్లో కూడా కొద్ది రోజులు చక్రం తిప్పాడు.
Advertisement
అలాంటి ఏవీఎస్ కు ఇద్దరు పిల్లలు. ప్రదీప్, ప్రశాంతి. 2008లో అనారోగ్యం వల్ల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఈ తరుణంలోనే కుమార్తె ప్రశాంతి తన తండ్రికి కాలేయాన్ని దానం చేసింది. కానీ ఆ వ్యాధి మళ్లీ తిరగబడడంతో 2013లో కన్నుమూశారు ఏవీఎస్. అలాంటి ఏవీఎస్ అల్లుడు అంటే తన కూతురు భర్త కూడా ఇండస్ట్రీలో నటుడే నట. ఆయన పేరు శ్రీనివాస్ దావగుడి.. చింటూ అని కూడా ఇండస్ట్రీలో పిలుస్తారట. ఈయన పలు మూవీస్ లో కూడా నటించారని, ఎక్కువగా రవి బాబు చిత్రాల్లో నటించారని తెలుస్తోంది.
also read: