మానవ శరీరంలో అన్ని సక్రమంగా పని చేయాలి అంటే తప్పనిసరిగా శరీరానికి కావలసిన ఆహార పదార్థాలను అందించాలి. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది డబ్బు మోజులో పడి సరైన సమయానికి ఆహారం తినకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో ప్రధాన సమస్య యూరిక్ యాసిడ్ మరి అది ఎందువల్ల వస్తుందో దానివల్ల కలిగే అనర్థాలు ఏంటో చూద్దాం..మన శరీరంలో యూరిక్ ఆసిడ్ ను నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.
Advertisement
also read:రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ వ్యాలిడిటీ ఎంతసేపు ఉంటుందో మీకు తెలుసా..?
ఎక్కువగా పెరిగితే కీళ్ల నొప్పులు, ఎముకల, ఇతర నొప్పులు పెరిగిపోతాయి. ఇది కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ యాసిడ్ గుండెపోటు సమస్యను కూడా తీసుకురావచ్చని ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే తప్పనిసరిగా ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని తిన్న తర్వాత తప్పనిసరిగా పండ్లను తినాలని అంటున్నారు. ముఖ్యంగా అరటి పండ్లు తినడం వల్ల యూరిక్ ఆసిడ్ ను సులభంగా తగ్గించవచ్చు. దీనికోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అరటి పండ్లు తినాలి.
Advertisement
అరటిపండ్లలో చాలా తక్కువ మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు అరటి పండ్లు తీసుకుంటే ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి ప్రయోజనం పొందుతారు. యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పండ్లను తినాలి. ఒకవేళ అరటి పండ్లు తినడం ఇష్టం లేకుంటే బనానా షేక్ లేదా బనానా చాట్ రూపంలో తీసుకోవచ్చు. దీనివల్ల యూరిక్ యాసిడ్ సమస్య దూరమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
also read: