Home » చికెన్ కర్రీ కోసం అవమానాలు ఎదుర్కొన్న సీనియర్ నటి డబ్బింగ్ జానకి..!!

చికెన్ కర్రీ కోసం అవమానాలు ఎదుర్కొన్న సీనియర్ నటి డబ్బింగ్ జానకి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కొంతమంది నటీనటులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. నాన్ వెజ్ తినడానికి ఎంత సమయమైనా వెయిట్ చేస్తారు ఎంతవరకైనా వెళుతూ ఉంటారు. ఒక్కోసారి అవమానాలు కూడా ఎదుర్కొంటారు. అలా చికెన్ కోసం అవమానాలు ఎదుర్కొంది స్టార్ నటి జానకి. ఆమెకు చికెన్ అంటే చచ్చేంత ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను అవమాన పడేలా చేసింది.. మరి చికెన్ కోసం వెళ్తే ఆమెకు అవమానం ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

also read:Pawan Kalyan : గుడిలో ఉంటే “వారాహి”.. రోడ్డు మీద ఉంటే “పంది” పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!

ఒక ఇంటర్వ్యూలో డబ్బింగ్ జానకి మాట్లాడుతూ తనకు అప్పులు అంటే చాలా భయమని , ఒక్క రూపాయి కూడా అప్పు లేదని ఆ దేవుడి దయ వల్ల హ్యాపీగా ఉన్నారని తెలియజేసింది. ప్రస్తుతం తాను వెజిటేరియన్ అని పేర్కొంది. అయితే ఒకప్పుడు కన్నడ మూవీ షూటింగ్ కోసం వెళ్లానని ఆ మూవీలో స్టార్ హీరో అనంత్ నాకు సహా మరికొందరు నటించారని అది భారీ బడ్జెట్ మూవీ అని అన్నది. మైసూర్ లో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ మూవీలో మదర్ క్యారెక్టర్ లో నటించాలని అన్నారు. 15 రోజుల షెడ్యూల్ ఉంది.

Advertisement

ఆ టైంలో నేను నాన్ వెజ్ ఎక్కువగా తినే దాన్ని, కన్నడ మేనేజర్ అందరికీ చికెన్ పెట్టి నాకు చికెన్ పెట్టలేదని అలా ఎందుకు చేసావు అని అడగగా డైరెక్టర్,హీరోయిన్, హీరోకు మినహా ఎవరికి చికెన్ పెట్టొద్దని ప్రొడ్యూసర్ చెప్పారని నా దగ్గర అన్నారు. కానీ నేను చికెన్ కోసం వారిని మళ్ళీ అడిగాను. అలా అడిగినా కానీ మళ్ళీ వారు పెట్టమని చెప్పారు. ఈ విధంగా నేను తినే చికెన్ కోసం అవమానాలు పడాల్సి వచ్చిందంటూ డబ్బింగ్ జానకి తెలియజేసింది.. ఇక అప్పటినుంచి నేను చికెన్ పై విరక్తి చెంది నాన్ వెజ్ పూర్తిగా వదిలేసి వెజిటేరియన్ గా మారానని చెప్పింది.

also read:

Visitors Are Also Reading