Home » రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ వ్యాలిడిటీ ఎంతసేపు ఉంటుందో మీకు తెలుసా..?

రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ వ్యాలిడిటీ ఎంతసేపు ఉంటుందో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా మనం రైల్వే స్టేషన్ లకు మన బంధువులు లేదా స్నేహితులు ఎవరో ఒకరు వస్తున్నారు అంటే పికప్ చేసుకోవడానికి వెళుతూ ఉంటాం. ఈ సమయంలో మనం స్టేషన్ లోకి ఎంటర్ కావాలి అంటే తప్పనిసరిగా ఫ్లాట్ఫామ్ టికెట్ అనేది అవసరం.. మరి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటే ఆ స్టేషన్లో ఎంతసేపు ఉండొచ్చు.. ఆ టికెట్ వ్యాలిడిటీ ఎంత సమయం ఉంటుంది. అనే విషయాలు చూద్దాం..

also read:Jan 25th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Advertisement

ముఖ్యంగా రైల్వే స్టేషన్ లోకి మన స్నేహితులని బంధువుల్ని ఫిక్ చేసుకోవడానికి, లేదంటే డ్రాప్ చేయడానికి స్టేషన్ కి వెళ్తే ప్లాట్ ఫామ్ టికెట్ కొనుగోలు చేసినప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. టికెట్ కొన్నాక రెండు గంటల వరకే ఫ్లాట్ ఫారంపై మనం ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ సేపు ఉంటే జరిమానా విధించాల్సి వస్తుంది.

Advertisement


రూల్స్:రైల్వే సంస్థ నిబంధన ప్రకారం ప్లాట్ఫామ్ టికెట్ 2 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందట. అంటే దాన్ని కొనుక్కున్న తర్వాత రెండు గంటల పాటు దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.. దీనికంటే ఎక్కువ సమయం మించితే జరిమానా విధించవచ్చు.. ఇక ఫ్లాట్ఫామ్ టికెట్ ధరలు మాత్రం ఆ స్టేషన్ను బట్టి మారుతూ ఉంటుంది. దీని విలువ పది రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉండవచ్చు.


ఫ్రీ పాసులు :అయితే కొంతమందికి ఉచిత పాసులు కూడా ఇస్తూ ఉంటారు. ఈ పాసులను వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, పోస్టల్ సర్వీస్ రైల్వే శాఖ, పోలీస్ శాఖ, ఎన్సిసి, రైల్వే కాంట్రాక్టర్లకు ఈ పాసులు ఇస్తారు.

పెనాల్టీ : ఒకవేళ ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకోకుండా స్టేషన్ లోకి ఎంట్రీ ఇస్తే తనిఖీ సిబ్బందికి దొరికామంటే 250 వరకు జరిమానా విధించవచ్చు. ఒక వ్యక్తికి ఎన్ని ప్లాట్ఫాం టికెట్లు కావాలంటే అన్ని జారీ చేయరు.. స్టేషన్లో ఉన్న స్థలాన్ని బట్టి ఈ టికెట్లను ఇస్తూ ఉంటారు.

also read:

Visitors Are Also Reading