సినిమా ఇండస్ట్రీ అంటేనే వారసత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ నటీనటుల పిల్లలు, మనవళ్ళు,మనవరాళ్లు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వివిధ రంగాల్లో కొనసాగుతున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి ఉన్న , ఒకప్పుడు మంచి పేరు సంపాదించుకున్న జయమాలిని కుటుంబం నుంచి మాత్రం ఎవరు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టడం లేదు. ముఖ్యంగా ఆమె కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు. కానీ ఆమె కూడా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని జయమాలిని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం..
Advertisement
also read:“లవ్ టూడే” సినిమా హీరోయిన్ ఇవానా షాజీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Advertisement
అప్పట్లో వందల సినిమాల్లో నటించిన జయమాలిని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుంది. ఆ తర్వాత మాత్రం నటించలేదు. నటించడమే కాదు తర్వాత మీడియా కు కూడా దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలోనే కొన్ని ఫంక్షన్లకు రావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేస్తోంది.. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో జయమాలిని మాట్లాడుతూ.. నేను వివాహం తర్వాత సినిమాల్లో నటించలేదు.. బాబు పుట్టిన తర్వాత అతని అలనా పాలనా చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాను. కనీసం సినిమాల గురించి ఆలోచన చేయలేదు.
అప్పట్లో నాకు సినిమాలకంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ ద్వారానే ఆదాయం వచ్చేదని చెప్పుకొచ్చింది. ఆస్తి అంతస్తుల విషయంలో కొదవలేదని, ఇప్పటికే చెన్నైలో నాలుగు బంగ్లాలు ఉన్నాయని, వాటికి చాలా రెంట్లు వస్తాయని తెలియజేసింది. ఎలాంటి చెడ్డ అలవాట్లు లేకపోవడం వల్ల మేము సంపాదించిన సంపాదన నిలబెట్టుకోగలిగామని అన్నది. మా అబ్బాయి మంచి అందగాడు, హీరో అందానికి కరెక్ట్ గా సరిపోతాడు. కానీ అతనికి యాక్టింగ్ అంటే ఇష్టం లేదు, మేము ఒత్తిడి కూడా చేయలేదు. అందువల్లే ఇండస్ట్రీలోకి రావడంలేదని జయమాలిని తెలియజేసింది.
also read:అట్లుంటది మనతోని..NTR ను కలిసిన టీమిండియా..ఫోటోలు వైరల్