Home » “వీరసింహారెడ్డి సినిమా డైలాగ్స్ పై ఏపీ సర్కార్ సీరియస్….చర్యలు తప్పవా….?

“వీరసింహారెడ్డి సినిమా డైలాగ్స్ పై ఏపీ సర్కార్ సీరియస్….చర్యలు తప్పవా….?

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మొదటి రోజు భారీ కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయంలో ఏపీ సర్కార్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలోని డైలాగులు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాపై చర్యలు తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో బాలయ్య చెబుతున్న డైలాగులు ఏపీ ప్రభుత్వంతో పాటు వైసిపి నేతలను విమర్శించే విధంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మంత్రి పిఏ పేరును సాయి రెడ్డి అని పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో విజయసాయిరెడ్డి కీలక వ్యక్తి అన్న సంగతి తెలిసిందే.

veerasimhareddy-review

Advertisement

అంతేకాకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై కూడా సినిమాలో ఇన్ డైరెక్ట్ గా డైలాగులు ఉన్నాయి. అయితే ఈ సినిమాను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు ప్రభుత్వ అధికారులు విజయవాడలో స్పెషల్ షో వేసుకుని మరీ చూసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డైలాగులు తమ దృష్టికి రావడంతో అధికారులు సినిమా చూసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు. మరోవైపు సినిమా టికెట్లను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలో డైలాగులు ఉండటంపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Also read : సంక్రాంతి పండుగ రోజు ఈ పని చేస్తే శని నుంచి విముక్తి పొందవచ్చు..!

Visitors Are Also Reading