Home » వివాదంలో ‘వీర సింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !

వివాదంలో ‘వీర సింహారెడ్డి’ డైలాగ్స్.. ఆ నాయకులు వెధవలు అంటూ.. !

by Bunty
Published: Last Updated on
Ad

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన మాస్ కమర్షియల్ మూవీ వీర సింహారెడ్డి. ఈరోజు థియేటర్ లోకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ లో, ప్రీమియర్ షోలు కూడా వచ్చాయి. తెల్లవారుజామునుంచే థియేటర్లలో జాతర మొదలైందని చెప్పవచ్చు. బాలకృష్ణ అభిమానులు థియేటర్ల వద్ద టపాసుల మోత మోగిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో బాలయ్య చెప్పిన డైలాగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. బుర్ర సాయి మాధవ్ రాసిన డైలాగులు బాలయ్య నోటా తూటాల్లా పేలాయి.

Also Read:  Veera Simha Reddy Movie Dialogues: వీరసింహారెడ్డి పవర్ ఫుల్ డైలాగ్స్

Advertisement


అయితే కొన్ని డైలాగులు మాత్రం పొలిటికల్ అజెండాతో అధికార వైసిపిపై విమర్శల బాణం ఎక్కుపెట్టినట్టుగానే అనిపిస్తాయి. దీంతో ఈ సినిమా చూసిన వైసిపి శ్రేణులు బాలయ్యపైన, దర్శకుడు గోపీచంద్ మలినేని పైన, ఆ డబుల్ మీనింగ్ డైలాగులు రాసిన సాయి మాధవ్ బుర్ర పైన గుర్రుగా ఉన్నారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘వీర సింహారెడ్డి’ చిత్రంలోని కొన్ని డైలాగులతో పాటు పాపులర్ డైలాగులను చూద్దాం.

veerasimhareddy-review

వీర సింహారెడ్డి డైలాగులు

Advertisement

# ఇది రాయలసీమ, రాయల్ సీమా, గజరాజులు నడిచిన దారిలో గజ్జ కుక్కలు కూడా నడుస్తుంటాయి, రాజుని చూడు కుక్కని కాదు.

# వాళ్లు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు, గౌరవించడం మన బాధ్యత.

# ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు, జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చమేయడం కాదు, పనిచేయడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు, నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు, పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో,

# సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చేత సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. బలం చూసుకుని నీకు పొగరేమో, బై బర్త్ నా డీఏన్ఏకే పొగరెక్కువా.

# మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా

# సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని, నేనొక్కడినే కత్తిపట్టా, పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు, ముందు తరాల కోసం. నాది ఫ్యాక్షన్ కాదు, సీమపై ఎఫెక్షన్.

# కాపు కాసిన కర్నూలోళ్లు, చుట్టుముట్టిన చిత్తూరోళ్లు, కమ్ముకొస్తున్న కడపొళ్లు, కత్తి కట్టిన అనంతపురమొళ్లు, ఎగసికొస్తున్నారు. ఎండనడినెత్తికి ఎక్కేలోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరువేసి పోదాం.

READ ALSO : Dhamaka Movie OTT: రవితేజ ధమాకా ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎందులో అంటే !

Visitors Are Also Reading