Dhamaka Movie OTT: గత కొంతకాలంగా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ సినిమాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా ‘ధమాకా’ నిలిచింది. రవితేజకు సూపర్ డూపర్ కమర్షియల్ సక్సెస్ అందించింది. వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ బరిలో సినిమా దూకుడు తగ్గలేదు. రవితేజ సరసర శ్రీలీల కథానాయికగా నటించిన ‘ధమాకా’ డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది.
Advertisement
Dhamaka Movie OTT Platform, Ott Release Date, Time
Dhamaka Movie OTT Release Date
మాస్ మహారాజా నుంచి సగటు అభిమాని తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో? ఆ అంశాలన్నీ ఉన్న సినిమా అని పేరు తెచ్చుకుంది. అయితే తొలి రోజు విమర్శకులతో పాటు కొంతమంది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కానీ థియేటర్లలో మాత్రం సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. వసూళ్లపరంగా దుమ్ము రేపుతోంది. ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాలలో ఓవర్ ఆల్ గా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటి రికార్డు క్రియేట్ చేసింది. కాగా, ఈ చిత్రాన్ని థియేటర్ లో మిస్ అయినవారు, ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Advertisement
అలాంటి వారికి తాజాగా ఓ గుడ్ న్యూస్ అందుతుంది. ఈ చిత్రం మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం జనవరి 22న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది అని ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. కాగా, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఓటీటీలో కూడా మంచి రికార్డ్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
READ ALSO : ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల..ఇలా డౌన్ లోడ్ చేసుకోండి