Ad
ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్ట్ బిసిసిఐ ….అందుకే ఆటగాళ్లకు ఎక్కడా లేని శాలరీలు మన బిసిసిఐ ఇస్తుంటుంది. ఆటగాళ్లకే కాదు కోచ్ కు కూడా భారీ మొత్తంలో ఇస్తుంది.
శాలరీలే కాకుండా అధనంగా కూడా కోచ్ లకు పెద్ద మొత్తంలోనే ముడుతుంటాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ద్రావిడ్ కు ఏడాదికి 10 కోట్లు ఇస్తున్నారు. ఇంతకు ముందు రవిశాస్త్రికి 8 కోట్లు ఇచ్చేవారు.
Advertisement
Advertisement
- ఈవెంట్స్ లో పాల్గొనడానికి వెళ్లాల్సి వస్తే మొదట్లో టీమ్ ఇండియా ఆటగాళ్లు ఎకానమీ క్లాస్ లో ప్రయాణించేవారు. 2017 నుండి బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్నారు.
- కపిల్ దేవ్ ఈ విషయంలో బిసిసిఐ కు ఓ ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేయాలని సూచించాడు. దీని ద్వారా సమయమే కాకుండా ఆటగాళ్ల భద్రతా , ప్రైవసీలు కూడా కాపాడినట్టు అవుతుందని తెలిపాడు. బిసిసిఐ ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
- కోచ్ లకు శాలరీతో పాటు డెయిలీ అలవెన్స్ కూడా ఉంటుంది. గతంలో రోజుకు 125 డాలర్లు ఉన్న డిఎ 2019 తర్వాత 250 డాలర్లు పెంచారు.
- ఇక పెద్ద పెద్ద ఈవెంట్స్ లో టీమ్ గెలిచినప్పుడు ఆటగాళ్లతో పాటు కోచ్ లకు కూడా భారీ మొత్తంలో నజరానాలు ప్రకటిస్తారు. అనిల్ కుంబ్లే కోచ్ గా ఉన్నప్పుడు 2017 లో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించినప్పుడు 25 లక్షలు ఇచ్చారు.
Also Read: పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే..