Home » బాబోయ్ 80ఏళ్ల త‌ర‌వాత‌ మ‌ళ్లీ పెరిగిపోతున్న న‌ల్లులు…కార‌ణ‌మేంటి..?

బాబోయ్ 80ఏళ్ల త‌ర‌వాత‌ మ‌ళ్లీ పెరిగిపోతున్న న‌ల్లులు…కార‌ణ‌మేంటి..?

by AJAY
Ad

న‌ల్లులు వేల సంవ‌త్స‌రాలు మ‌న ఇండ్ల‌లోనే నివ‌సించాయి. వీటి బెడ్ బ‌గ్స్ అని కూడా పిలుస్తారు. 5మిల్లీ మీటర్ల పొడ‌వు ఉంటూ ర‌క్తాన్ని పీల్చ‌తూ బ‌తుకుతాయి. న‌ల్లులు ప‌రాన్న జీవులు అంటే ఇత‌ర జీవుల‌పై ఆధార‌ప‌డి జీవిస్తుంటాయి. న‌ల్లుల్లో రెండు జాతుల‌కు చెందిన‌వి మ‌నుషుల‌పై ప్ర‌భావం చూపిస్తాయి. వీటిలో సిమిక్స్ లెక్చ‌రేరియ‌స్ ఒక‌టి కాగా మ‌రొక‌టి సీ హెమ‌క్ట‌ర‌స్…న‌ల్లుల కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు అనారోగ్యం భారిన‌ప‌డ్డారు. దాంతో క్రిమిసంహార‌క మందులు విస్త్రుతంగా వాడ‌టం వ‌ల్ల దాదాపుగా అంతం అయ్యాయి. అయితే ఇప్పుడు మ‌ళ్లీ న‌ల్లులు పెరిగిపోతున్నాయి.

Advertisement

bed bugs

bed bugs

క్రిమిసంహార‌క మందుల‌ను త‌ట్టుకునే శ‌క్తి న‌ల్లుల‌కు పెర‌గ‌టం మ‌నుషుల జీవన శైలి మార‌డ‌మే మ‌ళ్లీ న‌ల్లులు పెరిగేందుకు ముఖ్య కార‌ణం. న‌ల్ల‌లు కుట్టిన తొమ్మిది రోజుల త‌ర్వాత చ‌ర్మం పై గాయాలు ద‌ద్దుర్లు క‌నిపిస్తుంటాయి. వాటి నుండి బ‌య‌ట‌ప‌డాలంటే చాలా రోజులు ప‌డుతుంది. కానీ కొంత మందికి న‌ల్లి కాటు వ‌ల్ల ఎలాంటి మంట దుర‌ద ఉండ‌దు. న‌ల్లులు కుట్టిన చోట ఎక్కువ‌గా రుద్ద‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ ల భారిన ప‌డే ప్ర‌మాదం కూడా ఉంది. గోడ ప‌గుల్లలో…బెడ్ల కింద న‌ల్లులు ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటాయి. నల్లులు దాక్కునే ప్ర‌దేశంలో తుప్పు లాంటి మ‌ర‌క‌లు క‌నిపిస్తు ఉంటాయి.

Advertisement

ఇటీవ‌ల కాలంలో సినిమా థియేట‌ర్ల‌లో ఎక్కువ‌గా న‌ల్లులు క‌నిపిస్తున్నాయి. న‌ల్లులు కుట్టిన త‌ర‌వాత ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉంటే ఎలాంటి చికిత్స అవ‌స‌రం లేదు గానీ ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉంటే మాత్రం డాక్ట‌ర్లను సంప్రదించాలి. న‌ల్లులు ఆహారం లేకుండా ఏకంగా 12నెల‌లు జీవించ గ‌లవు. న‌ల్లులు రాకుండా ఉండాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే చాలు. సెకండ్ హ్యాండ్ ఫ‌ర్నిచ‌ర్ లు కొనేటప్పుడు వాటిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. వాటిలో గ‌నుక న‌ల్లులు ఉంటే అవి ఇళ్లంతా వ్యాపిస్తాయి.

Visitors Are Also Reading