ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే మిగతా ఇండస్ట్రీ వారు చిన్న చూపు చూసేవారు. అలాంటి తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని బాహుబలి సినిమా ఎక్కడికో తీసుకు వెళ్ళింది అని చెప్పవచ్చు. జక్కన్న ఏ ముహూర్తాన బాహుబలి ని స్టార్ట్ చేశారో కానీ ప్రపంచ నలుమూలల ఇండస్ట్రీల చూపు తెలుగు సినిమా ఇండస్ట్రీ పై పడింది. భారీ బడ్జెట్ తో అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు ఈ మూవీ ని.. అలాంటి బాహుబలి సినిమా లాంటి మూవీని అన్నగారు ఎన్టీఆర్ ఆ సమయంలోనే తీసారట.. అందులో ఎన్టీఆర్ తో బాలకృష్ణ కూడా నటించారట.. కానీ ఆ సినిమా విడుదల అవ్వలేదు.. కారణాలు ఏంటో చూద్దాం.
Advertisement
also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి
సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు షూటింగ్ పూర్తయి కొన్ని కారణాల వల్ల ఆగిపోతాయి. మరికొన్ని సగం షూటింగ్ పూర్తి చేసుకొని ఆగిపోతూ ఉంటాయి. అలాంటిది అప్పట్లోనే బాహుబలి లాంటి సినిమా షూటింగ్ మొదలు పెట్టారట. కొంత షూటింగ్ పూర్తయ్యాక అది ఆగిపోయింది.. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే కంచు కాగడ.. ఈ సినిమాని బాలయ్యతో కలిసి ఓ భారీ జానపద చిత్రం గా చేయాలని అనుకున్నారట ఉప్పలపాటి విశ్వేశ్వరరావు. కాస్త లేట్ అవడంతో ఆ గ్యాప్ లో మరో కథ రాసి కంచుకోట అనే సినిమాను నిర్మించారట. దీనికి కేఎస్ రావు దర్శకత్వం వహించగా బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు. సావిత్రి, దేవిక హీరోయిన్లు. ఈ సినిమాకు అప్పట్లోనే ఏడు లక్షల బడ్జెట్ పెట్టారు. సినిమా 30 సెంటర్లలో విడుదలై కేవలం 7 రోజుల్లోనే ఏడు లక్షలు వసూలు చేసింది..
Advertisement
ఇక దీని తర్వాత ఎన్టీఆర్ తో కంచు కాగడా సినిమా ప్లాన్ చేశారు. దీనికి నిర్మాత విశ్వేశ్వరరావు. ఇది కూడా జానపద చిత్రం లాగే తిరకెక్కించాలి. ఇందులో జమున హీరోయిన్.. సినిమాలో ఎన్టీఆర్ మరియు బాలకృష్ణతో కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత జమున గర్భవతి అయిందని ప్రసవమయ్యాక సినిమా చిత్రీకరణ చేద్దామనుకున్నారు.. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఇందులో కీలకపాత్ర పోషించే బాలీవుడ్ హీరో మరణించడంతో సినిమా వాయిదా పడి ఆగిపోయింది.. అయితే ఈ చిత్రాన్ని అప్పట్లో ఒక బాహుబలి రేంజ్ లో నిర్మిద్దామని అనుకున్నారట చిత్ర యూనిట్.
also read: