Home » హైదరాబాద్‌ లో దారుణం.. ఆర్డర్ లేట్ గా తెచ్చాడని ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై దాడి

హైదరాబాద్‌ లో దారుణం.. ఆర్డర్ లేట్ గా తెచ్చాడని ఫుడ్‌ డెలివరీ బాయ్‌పై దాడి

by Bunty
Ad

ప్రస్తుత బిజీ లైఫ్‌ లో ఆన్‌ లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు బాగా అయిపోయాయి. స్విగ్గి, ఫుడ్ పాండా, జొమాటో, ఉబర్ ఈట్స్, ఇలా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంటికి తెచ్చి ఇచ్చే యాప్స్ సంఖ్య ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ సమయంలో అయినా ప్రజల ఆకలి తీరుస్తున్నాయి ఈ యాప్స్. అయితే ఇప్పటిదాకా ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్స్ మాత్రమే తెచ్చి ఇచ్చేవాళ్ళు. త్వరలోనే మహిళలు కూడా డెలివరీ చేయనున్నారట. ఇది ఇలా ఉండగా,

Advertisement

తాజాగా హైదరాబాద్ లోని హుమాయున్ నగర్ లో ఓ కస్టమర్ వీరంగం సృష్టించాడు. ఆర్డర్ లేట్ అయిందని ఫుడ్ డెలివరీ బాయ్ పై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు. 15 మంది అనుచరులతో కలిసి వెళ్లి హోటల్ దగ్గర వీరంగం సృష్టించాడు. హోటల్ కి వెళ్లి డెలివరీ బాయ్ పై యువకులు దాడికి పాల్పడ్డారు. దాడి నేపథ్యంలో హోటల్లోని కిచెన్ లో స్టవ్ మీద ఉన్న మరిగే నూనె పైన పడటంతో డెలివరీ బాయ్ తో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల సమక్షంలోనే గొడవ జరిగిందని హోటల్ సిబ్బంది చెబుతోంది.

Advertisement

గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కస్టమర్ తన 15 మంది అనుచరులతో హోటల్ దగ్గరకు వచ్చాడు. దీంతో డెలివరీ బాయ్ భయంతో హోటల్ లోపలికి పరుగులు పెట్టారు. దీంతో అనుచరులు 15 మంది కూడా హోటల్లోకి చొచ్చుకెళ్లారు. అందరూ కలిసి డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. హోటల్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేసిన ఆగకుండా మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డాడు. హోటల్ యాజమాన్యం సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

read also  : అట్లుంటది మనతోని..! మద్యం విక్రయాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డు.. 2022లో రికార్డు బద్దలు

Visitors Are Also Reading