Home » రేటు పెంచేసిన ధమాకా బ్యూటీ…! ఒక్క సినిమాకే అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా..?

రేటు పెంచేసిన ధమాకా బ్యూటీ…! ఒక్క సినిమాకే అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం టాలీవుల‌డ్ లో స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న బ్యూటీ శ్రీలీల‌. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టించిన పెళ్లి సంద‌డి సినిమాతో శ్రీలీల టాలీవుడ్ కు హీరోయిన్ గా ప‌రిచయం అయ్యింది. ఆ సినిమా హిట్ అవ్వ‌లేదు కానీ శ్రీలీల అందానికి టాలీవుడ్ ఫిదా అయ్యింది. ఇక ప్రస్తుతం ఈ కుర్ర‌ది టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటోంది. తాజాగా ర‌వితేజ హీరోగా న‌టించిన ధ‌మాక సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో శ్రీలీల ప‌ర్ఫెమెన్స్ తో అద‌ర‌గొట్టింది.

Advertisement

అంతే కాకుండా శ్రీలీల డ్యాన్స్ ల‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కేవ‌లం 21 ఏళ్ల వ‌య‌సులోనే శ్రీలీల త‌న అందం మ‌రియు ప‌ర్ఫామెన్స్ తో కోట్లల్లో అభిమానుల‌ను సంపాదించుకుంది. రెండో మూవీతోనే ర‌వితేజ ప‌క్క‌న ఛాన్స్ కొట్టేయ‌డంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం శ్రీలీల వైపే చూస్తోంది. అంతే కాకుండా రామ్ బోయ‌పాటి కాంబినేష‌న్ లో మాస్ ఓరియెంటెడ్ సినిమా తెర‌కెక్కుతోంది.

Advertisement

Sreeleela

ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా శ్రీలీల‌ను ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే సాధార‌ణంగా హీరోయిన్ ల‌కు రెమ్యున‌రేష‌న్ లు త‌క్కువ‌గా ఉంటాయి. అంతే కాకుండా కొన్ని హిట్ లు ప‌డితేనే రెమ్యున‌రేష‌న్ లు పెరుగుతాయి. కానీ రెండో సినిమాకే శ్రీలీల ర‌వితేజ ప‌క్క‌న న‌టించే ఛాన్స్ తో పాటూ 40 ల‌క్ష‌ల రూపాయల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు సమాచారం.

మ‌రోవైపు రామ్ బోయ‌పాటి సినిమాకు శ్రీలీల రూ కోటి తీసుకుంటున్న‌ట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా తన ఫ్యాచర్ ప్రాజెక్ట్ ల కోసం ఈ బ్యూటీ ఏకంగా కోటిన్న‌ర డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఒక‌టి రెండు సినిమాల‌కే ఈ రేంజ్ లో డిమాండ్ చేసిన హీరోయిన్ లు చాలా త‌క్కువే. అయితే శ్రీలీల ద‌గ్గ‌ర టాలెంట్ తో పాటూ అందం ఉంది కాబ‌ట్టి ఆమె డిమాండ్ చేయ‌డంలో తప్పులేదు.

ALSO READ :  ప్రభాస్ ఆ 21 కోట్ల అప్పు ఎందుకు చేశాడో తెలుసా?

Visitors Are Also Reading