సాధారణంగా శనివారం రోజు శనిదేవుడికి చెందిందని నమ్ముతుంటారు. ఒక వ్యక్తి శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే అతని పనులన్నీ పూర్తి అవుతాయని శని దేవుడి అసంతృప్తి కారణంగా పనికి ఆటంకాలు ఎదురవుతాయని నమ్ముతుంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తారు.
Advertisement
శనివారం రోజు ఏదైనా దానం చేస్తే మంచి ఫలితాలుంటాయని చాలా మంది నమ్ముతుంటారు. తప్పుగా దానం చేస్తే అది జీవితానికే ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. శనివారం రోజు ఈ పూజను చదివిన తరువాత మీరు దేవుడి ఆశీర్వాదం పొందడానికి దాన, దక్షిణ చేయాలి. శనివారం పసుపు వస్తువులను దానం చేయకూడదు. శనివారం పసుపు వస్తువులను దానం చేస్తే.. అది మీకు హానికరమని నమ్ముతుంటారు. శనివారం పొరపాటున కూడా తమరు పసుపును దానం చేయకూడదు. ఏ పసుపు వస్తువును కూడా దానం చేయకూడదు. పసుపు వస్తువులు బృహస్పతి గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. శని, బృహస్పతి ఒకరినొకరు శత్రువులను శాస్త్రాల్లో చెప్పబడింది. శనివారాల్లో బంగారం, ఇత్తడి, పసుపు, పసుపు బట్టలు కొని దానం చేయడం వల్ల శనిదేవునికి కోపం వస్తుంది.
Advertisement
Also Read : రామసేతుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే..!
శనిదేవుని పూజలో తెల్లటి వస్తువులు సమర్పించకూడదు. శనివారం తెల్లని వస్తువులను దానం చేయకూడదు. తెల్లని వస్తువులు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటాయి. మీరు తెల్లని వస్తువును దానం చేయకూడదు. మీకు హాని కలిగించవచ్చు. శనివారం బియ్యం, పంచదార, వెండి మొదలైన వస్తువులను ఎప్పుడూ దానం చేయకూడదు. అదేవిధంగా శని దేవుడికి కోపం తెప్పించే ఎరుపు వస్తువులను శనివారం దానం చేయకూడదు. ఎర్ర ధాన్యాలను దానం చేయకూడదు. శని దేవుడికి కోపం తెప్పించొచ్చు.
Also Read : మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలతో సులభంగా తగ్గించుకోండి..!