Home » రామసేతుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే..!

రామసేతుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే..!

by Anji
Ad

రామసేతు లొల్లి అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి పార్లమెంట్ ని తాకింది. ఎన్నో ఏళ్లుగా వాదోపవాదాలకు కేంద్ర బిందువు అయిన ఈ అంశం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హర్యానాకు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ కార్తికేయ శర్మ అడిగిన ప్రశ్నతోనే మరోసారి రామసేతు అంశం దేశాన్నే షేక్ చేసింది. ఎంపీ అడిగిన ప్రశ్నపై సమాధానంగా క్లారిటీ ఇచ్చారు మంత్రి జితేంద్ర సింగ్.

Advertisement

ఇప్పటివరకు జరుగుతున్న చర్చలకు ఒక్క సమాధానంతోనే పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రామసేతు మూలాలకు సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఆధారాలను ఇండియన్ శాటిలైట్స్ ఫైండవుట్ చేయలేదు అని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. రామసేతు ఫోటోలను ఇండియన్ శాటిలైట్స్ హై రిజల్యూషన్ తో పిక్స్ తీశాయి. సేతువు ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లేవు అన్నది ప్రభుత్వ వివరణ. యూపీఏ హయాంలో ఇదే సభలో నాటిప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పింది కూడా ఇదే అంటుంది కాంగ్రెస్. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ తమను హిందూ వ్యతిరేక పార్టీగా విమర్శలు చేసిందంటూ మండిపడుతోంది. సముద్రంలో కొన్ని అవశేషాలను గుర్తించామని, కచ్చితంగా రామసేతుకు సంబంధించినవే అని చెప్పడం కష్టం అని అంటుంది. 56కిలోమీటర్ల పొడవుతో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సేతువుకు సంబంధించి కొన్ని సున్నపురాయి ద్వీపాలను గుర్తించాం అంటుంది కేంద్రం. కొన్ని బండరాళ్లు వాటిలో ఆ వంతెనకు సంబంధించనవే అని, సముద్రం మధ్యలో ఏదో ఒక నిర్మాణం అయితే ఉన్నదనేది సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తుందని కేంద్రం వివరణ ఇచ్చింది. 

Also Read :  అప్పటి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తండ్రిని గుర్తు చేసుకుంటూ..!

Advertisement

తమిళనాడులోని పంబన్ దీవికి, శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఈ నిర్మాణానికి దక్షిణ భారతదేశంలో రామసేతు అని పేరు. అదే శ్రీలంకలో అయితే అడాంగ పాలం అని పిలుస్తుంటారు. ఆంగ్లంలోఅయితే ఆడమ్స్ బ్రిడ్జ్ అంటుంటారు. రాముడి కాలం త్రేతాయుగం అయితే.. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. లంకను చేరేందుకు రాముడు సముద్రాన్ని చీల్చుతూ వానసేన సహాయంతో చేసిన నిర్మాణమే రామసేతు. యుగాలు దాటిన కథ రామసేతుది. చరిత్ర ఎంత పాతదో దీనిపై వాదోపవాదాలు అంతే పాతవి. దీనిపై ఎన్నో పరిశోధనలు మరెన్నో వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ప్రపంచ పరిశోధకులది సైతం రామసేతుపై స్పెషల్ నాసా కూడా పరిశోధనలు చేసినా ఎటూ తేల్చలేదు. 

Also Read :   పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లులో ఔరంగజేబుగా నటించేది ఎవరో తెలుసా ?

Drilling for research at Ram Setu can start any time: NIO scientist |  Deccan Herald

గతంలో యూపీఏ ప్రభుత్వం శ్రీలంక, భారత్ మధ్య సముద్ర మార్గం ప్రయాణాన్ని తగ్గించేందుకు సీతా సముద్ర ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. దానివల్ల రామసేతు దెబ్బతినే ప్రమాదముందని బీజేపీ, ఆర్ఎస్ఎస్ సహా ఇతర హిందుత్వ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. రామసేతుపై విభిన్న వాదనలు వినిపించాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2021లో సాక్ష్యాధారాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చింది. రంగంలోకి దిగిన పరిశోధనా బృందం మూడేళ్ల పాటు రీసెర్చ్ చేసింది. తాజా ప్రకటన చేస్తుండొచ్చన్నది విశ్లేషకుల మాట. పురావస్తు అధ్యయనాల ప్రకారం.. లక్ష75వేల సంవత్సరాల కిందటిది. రామాయణంలో యుద్ధకాండలో దీని ప్రస్తావన ఉంది. సముద్రంలో సహజసిద్ధంగానే ఏర్పడిన నిర్మాణమే ఈ సేతువు అని కొందరూ వాదించడం విశేషం.  

Also Read :  అప్పటి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తండ్రిని గుర్తు చేసుకుంటూ..!

Visitors Are Also Reading