బ్రిటీష్ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా మెలిగినటువంటి అసఫ్ జా ముజఫరుల్ ముల్క్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911 హైదరాబాద్ సంస్థానం సింహాసనాన్ని అధిరోహించారు. ఆ కాలంలో ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధి చెందారు. ఫిబ్రవరి 22, 1937లో విడుదలైన టైమ్ మ్యాగజైన్ సంచికలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంటూ కవర్ పేజీపై కథనాన్ని ప్రచురించారు.
Advertisement
ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానం వైశాల్యం 80,000 చదరపు కిలోమీటర్లకు పైగా ఉండేది. ఇంగ్లండ్, స్కాట్లండ్ మొత్తం వైశాల్యం కన్నా ఎక్కువగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంత ధనవంతుడో అంత పిసినారి. నిజాం నవాబ్ కి అత్యంత సన్నిహితుడైన వాల్టర్ మాంక్టన్ జీవిత చరిత్ర ది లైఫ్ ఆఫ్ విస్కౌంట్ మాంక్టన్ ఆఫ్ బ్రెంచ్ లీలో ఫ్రెడరిక్ బర్కెన్ హెడ్, మీర్ ఉస్మాన్ అలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు.
Advertisement
Also Read : నిజంగా వెంకటేష్, రోజాల మధ్య 25 ఏళ్లుగా మాటలు లేవా.. కారణం ఏంటి?
వాస్తవానికి నిజాం నవాబ్ పొట్టిగా ఉండేవారు. కొంచెం వంగి నడిచే వారు. ఆయన భుజాలు కూడా చిన్నవిగా ఉండేవి. వంపు తిరిగిన ఒక చేతికర్రను ఆసరాగా చేసుకుని నడిచేవారు. కొత్త వారిని చురుకుగా చూసేవారు. 35 ఏళ్ల పాత ఫేజ్ టోపీ ధరించే వారు. అందులో చుండ్రు పేరుకుపోయి ఉండేది. గోదుమరంగు షేర్వానీ తెల్లని ఫైజామా ధరించే వారు. మెడ దగ్గర గుండీలు పెట్టుకునే వారు కాదు. పసుపు రంగు సాక్సులు ధరించే వారు. అప్పుడు కాళ్లు మాత్రమే కనిపించేవి. నిజాం నవాబ్ కి చెడ్డ వ్యక్తిత్వంతో పాటు ప్రజలపై ఆధిపత్యం చెలాయించే నైజాం కూడా ఉండేది. మరికొన్ని సందర్భాలలో కోపంతోనో లేదా ఉత్సాహంతోనో గట్టిగా అరిచేవారు. అప్పుడు ఆయన గొంతు 50 గజాల దూరం వరకు వినిపించేది.
Also Read : చిరంజీవి ఆస్తి విలువ ఎంతో తెలుసా..?రాజకీయాల కారణంగా నష్టపోయారా !