తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆయన నటన డ్యాన్స్ ఏ క్యారెక్టర్లో అయినా ఇట్టే దూదిరిపోయే టాలెంట్ ఉన్న నటుడు. అలాంటి ఎన్టీఆర్ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన తాత నటించిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా లో బాల నటుడిగా కనిపించిన ఎన్టీఆర్ 1996 లో బాల రామాయణం మూవీలో కూడా నటించాడు. గుణశేఖర్ డైరెక్షన్లో పిల్లలతో కలిసి నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా బాల రామాయణం. మల్లెమాల బ్యానర్ పై ఎమ్మెస్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లోనే ఈ సినిమా 100 రోజులు ఆడి సంచలన రికార్డు క్రియేట్ చేసుకుంది.
Advertisement
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పట్లో జాతీయస్థాయి ఉత్తమ బాలల చలన చిత్రంగా ఎంపిక కాబడింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనే కాకుండా సీత పాత్రలో నటించిన చిన్నారి నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె క్యూట్ లుక్స్ తో పాటు ఎన్టీఆర్ పక్కన సీతగా చేసి ఎందరినో ఆకట్టుకుంది. ఆ చిన్నారి పేరు స్మిత మాధవ్. ఈ చిత్రం వచ్చి ఇప్పటికే 25 సంవత్సరాలు పూర్తి కావస్తోంది.
Advertisement
also read;ఫ్రిజ్ లో ఈ పదార్థాలు అస్సలు నిల్వ ఉంచకూడదు.. ఎందుకంటే..?
మరి అప్పట్లో సీతగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. స్మిత మాధవ్ కర్ణాటక క్లాసికల్ సింగర్. అంతేకాకుండా భరతనాట్యంలో మంచి డాన్సర్. ఆమె తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సంగీత నృత్యంలో డిప్లమా కోర్స్ పూర్తి చేసింది. ఈ విధంగా బాల రామాయణంలో సీత పాత్రలో నటించిన స్మిత మాధవ్ రీసెంట్ గా ఆర్ట్ ఫిలిం పృద్వితో కూడా హీరోయిన్ గా చేసింది. బుల్లితెర షోలలో యాంకర్ గా కూడా చేస్తోంది. అలాంటి స్మిత మాధవ్ ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా చూడండి..