Telugu News » Blog » Big boss6 telugu shrihan: శ్రీహాన్ ముస్లిం అని తెలుసా.. కానీ హిందూ పేరు పెట్టుకోవడం వెనుక షాకింగ్ నిజాలు..?

Big boss6 telugu shrihan: శ్రీహాన్ ముస్లిం అని తెలుసా.. కానీ హిందూ పేరు పెట్టుకోవడం వెనుక షాకింగ్ నిజాలు..?

by Sravanthi Pandrala Pandrala
Ads

బిగ్ బాస్ సీజన్ 6 ఎంతో అట్టహాసంగా కొనసాగిన ఈ రియాలిటీ షో ముగిసింది. రేవంత్ టైటిల్ విన్నర్ గా శ్రీహన్ రన్నరప్ గా నిలిచారు. ఈ తరుణంలో శ్రీహాన్ రేవంత్ గురించి సోషల్ మీడియా వేదికగా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే అసలు విన్నర్ శ్రీహాన్ అయినా కానీ ఆయన సూట్ కేస్ ఆఫర్ ను ఒప్పుకోవడం వల్ల ఫైనల్ విన్నర్ గా నిలిచారు. సూట్ కేస్ ఆఫర్ ద్వారా 40 లక్షల రూపాయలు శ్రీహాన్ గెలుచుకున్నాడు. సాధారణంగా శ్రీహాన్ గురించి జనాలకు తెలిసింది తక్కువే. సిరి బాయ్ ఫ్రెండ్ గా మాత్రమే అందరికీ పరిచయమయ్యాడు శ్రీహాన్.

Advertisement

also read:నాగార్జునకు షాక్ …లీగల్ నోటీసులు పంపించిన సర్పంచ్…!

హౌస్ లో శ్రీహాన్ రిస్కు తీసుకోకుండా సేఫ్ గేమ్ ఆడుతూ ఫైనల్ వరకు చేరుకున్నాడు. కానీ చివరి నిమిషంలో అమ్మానాన్నల మాట కాదనకుండా సూట్ కేస్ ఆఫర్ ను ఒప్పుకొని 40 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అలాంటి శ్రీహాన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. శ్రీహాన్ ముస్లిం కుటుంబంలో పుట్టాడని, తన పేరు మాత్రం హిందూ పేర్లను పోలి ఉంటుందని, ఇండస్ట్రీలో రాణించడం కోసం శ్రీహాన్ గా మార్చుకొని ఉండొచ్చని అంటున్నారు. శ్రీహాన్ పుట్టింది వైజాగ్. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు శ్రీహాన్ మూడేళ్లు నేవీలో పని చేసినట్టు సమాచారం.

Advertisement

ఆయనకు ఇద్దరు సోదరులు.నటనపై ఉన్న ఆసక్తితో యూట్యూబర్ గా మారాడు. సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు పేరుతో వచ్చిన షార్ట్ ఫిలిం తో శ్రీహాన్ ఫేమస్ అయిపోయాడు. అంతేకాకుండా సిరి తో షార్ట్ ఫిలిం నటిస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. ఈ తరుణంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ 5 లో సిరి పాల్గొంది. ఈ తరుణంలో శ్రీహన్ బయట ఉండి ఆమెకు ఎంతో సపోర్ట్ చేశాడు. బిగ్ బాస్ 6 లో శ్రీహాన్ కి అవకాశం దక్కింది. ఈ విధంగా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ శ్రీహన్ ఫైనల్ కు వెళ్లాడు. కానీ తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సూట్ కేస్ ఆఫర్ ని ఎంచుకొని, రేవంత్ విన్నర్ అయ్యేలా సహకారం అందించాడు. ఇక పోతే సిరి శ్రీహాన్ ల నిశ్చితార్థం కూడా జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

also read:మహానది మూవీలో కమలహాసన్ కూతురుగా చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..!!