Home » రమీజ్ రాజా ని పీసీబీ చైర్మన్ పదవీ నుంచి తొలగించడానికి కారణం ఇదేనా..?

రమీజ్ రాజా ని పీసీబీ చైర్మన్ పదవీ నుంచి తొలగించడానికి కారణం ఇదేనా..?

by Anji
Ad

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ వైట్ వాష్ కావడంత ఆదేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లు వెత్తడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి రమీజ్ రాజా పదవీ కూడా ఊడింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రమీజ్ రాజాను తొలగిస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేశారు. 

Advertisement

అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తదుపరి చైర్మన్ గా మాజీ జర్నలిస్ట్ నజామ్ షెథీ నియామకానికి కూడా పాక్ ప్రధాని ఆమోదం తెలిపారు. రమీజ్ రాజా దాదాపు 15 నెలల పాటు పీసీబీ చైర్మన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం అతని స్థానం నజామ్ షేథీ మూడో సారి పీసీబీ చైర్మన్ కుర్చీలో కూర్చోనున్నారు. కొద్ది రోజుల కిందటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీఠం నుంచి రమీజ్ రాజాని తొలగిస్తున్నారనే వార్తలను పాక్ మీడియా లో వినిపించాయి. మరోవైపు నజామ్ షెథీ నియామకానికి సంబంధించి పాకిస్తాన్ పీఎంఓ త్వరలోనే నాలుగు నోటిఫికేషన్లను జారీ చేయబోతుందని కూడా అందులో పేర్కొనడం గమనార్హం. 

Advertisement

Also Read :  Sachin To Kohli : 2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు

పాక్ మాజీ కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ అయినటువంటి రమీజ్ రాజాను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 13, 2021న పీసీబీ చైర్మన్ కుర్చీలో కూర్చొబెట్టింది. రమీజ్ హయాంలో పాకిస్తాన్ రెండు టీ-20 వరల్డ్ కప్ లు, 50 ఓవర్ల మహిళ వన్డే ప్రపంచ కప్ లలో పాల్గొంది. ఎందులో కూడా విజయం సాధించలేకపోయింది. గత కొద్ది నెలలుగా బీసీసీఐతో పాటు భారత క్రికెట్ జట్టుపై వరుసగా విమర్శలు చేస్తున్నాడు రమీజ్ రాజా. ప్రధానంగా ఆసియాకప్, ప్రపంచ కప్ లకు సంబంధించి అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. దీనికి తోడు స్వదేశంలో ఇంగ్లండ్ తో జరిగినటువంటి మూడు టెస్టుల  సిరీస్ లో పాక్ జట్టు క్లీన్ స్వీప్ అయింది. జట్టు ఎంపిక చేసిన విధానమే పరాజయానికి కారణం అని తెలుస్తోంది. అదేవిధంగా ఇంగ్లండ్ సిరీస్ లో పిచ్ ల తయారీపై కూడా ఆరోపణలు వినిపించడంతో రమీజ్ ని పీసీబీ చైర్మన్ పదవీ నుంచి తొలగించారు. 

Also Read :   సూర్యకుమార్ యాదవ్ ఇంత అద్భుతంగా ఆడేందుకు అతని భార్య పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ?

 

Visitors Are Also Reading